BREAKING
57వ ఇఫీ ముగింపు చిత్రంగా ఆంథోనీ చెన్ ‘వీ ఆర్ ఆల్ స్ట్రేంజర్స్’ అనకాపల్లి ఎంపీపీగా బొడ్డపాటి నారాయణమ్మ ఎంపిక. పుట్టగొడుగుల పెంపకంపై ఉచిత శిక్షణ రామళ్లకోట సర్పంచ్ బరిలో మంచిరెడ్డి మౌనిక టీడీపీ నాయకుడు శశికళధరప్ప (శశి) కుటుంబం నుంచి అభ్యర్థిత్వం జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే జాప్ ప్రధాన లక్ష్యం! జర్నలిస్టుల హక్కుల సాధనకు నిరంతర పోరాటం చేస్తాం ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తపోవనం బుద్ధిమాంద్య ఆశ్రమంలో కేక్ కట్ చేసి, పండ్ల పంపిణీ.. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జర్నలిస్టు నేతలు జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే జాప్ ప్రధాన లక్ష్యం! జర్నలిస్టుల హక్కుల సాధనకు నిరంతర పోరాటం చేస్తాం ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తపోవనం బుద్ధిమాంద్య ఆశ్రమంలో కేక్ కట్ చేసి, పండ్ల పంపిణీ.. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జర్నలిస్టు నేతలు 83 వేలు దాటిన సెన్సెక్స్, 25,500 పైకి చేరిన నిఫ్టీ విశ్వక్ సేన్ కల్ట్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే! దీపికా పదుకొణె డిమాండ్‌కు ఆలియా భట్ మద్దతు.. సెట్స్‌లో మహిళలకు కనీస సౌకర్యాలపై కీలక వ్యాఖ్యలు! తైక్వాండోలో పసిడి పతకాల పంట.. జాతీయ స్థాయికి పాత మంచిర్యాల క్రీడాకారులు! కార్పొరేట్ విద్యా సంస్థల లాభాల కోసం విద్యార్థులను బలి చేయడం సరికాదు .. చెప్పేదొకటి ఫీజులు వసూళ్లలో ఆచరించేది ఒకటి. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బీఎస్-6 వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ గడువు పెంపు శ్రీలంకలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు భారత్ ఇటలీ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం 20 బిలియన్ యూరోలు

ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరా ధరలపై కలెక్టర్ సమీక్ష

Select Suryaa Now
ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరా ధరలపై కలెక్టర్ సమీక్ష

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల ధరల నిర్ణయంపై జిల్లా కలెక్టర్ టెండర్‌దారులతో సమావేశం నిర్వహించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సంక్షేమ శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో గుడ్ల ప్రస్తుత మార్కెట్ ధరలు, కొనుగోలు ధరలు, రవాణా ఖర్చులు, సరఫరా వ్యయం తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ధరలు నిర్ణయించే అంశంపై టెండర్‌దారుల అభిప్రాయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు, చిన్నారులకు అందించే పోషకాహార పథకాల అమలులో ఎలాంటి అంతరాయం కలగకుండా నాణ్యమైన గుడ్లను నిర్ణీత సమయంలో సరఫరా చేయాలని సూచించారు. గుడ్ల ధరల నిర్ణయంలో పారదర్శకత పాటించాలని, ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని, సరఫరాదారులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. గుడ్ల ధరలు, సరఫరా విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఎం.జె.ఆర్. పౌల్ట్రీ, గీత పౌల్ట్రీ ప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.