విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి - మండల వైద్యాధికారి
సూర్య- బిక్కనూర్ : విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మండల వైద్యాధికారి హేమీమా సూచించారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమున్నవారికి మందులు పంపిణీ చేశారు. చలి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటించాలని, భోజనం చేసేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని తినాలని, ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే స్థానిక ఆరోగ్య ఉప కేంద్రంలో సంప్రదించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో బిసి వెల్ఫేర్ అధికారి పవన్ కుమార్, ఏఎన్ఎంలు లలిత, శ్యామల, ఆశా కార్యకర్తలు, వసతి గృహ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు