BREAKING
బీఎస్-6 వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ గడువు పెంపు శ్రీలంకలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు భారత్ ఇటలీ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం 20 బిలియన్ యూరోలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరా ధరలపై కలెక్టర్ సమీక్ష కావ్య మారన్ కోసం పెళ్లి వేడుకలో అనిరుధ్ పాట.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ! ఏపీఎన్జీవోస్ ఆధ్వర్యంలో 504 మంది మహిళా ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు శ్రీలంక 2027 బడ్జెట్ రుణ తగ్గింపు బాటలోనే.. ఫిచ్ రేటింగ్స్ కీలక అంచనాలు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి - మండల వైద్యాధికారి ఎరువుల కొనుగోలుకు ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ తప్పనిసరి మహిళా సాధికారతకు సింగరేణి చేయూత గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 మూడవ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* ప్రకృతి సాగుతోనే రైతులకు భరోసా - కలెక్టర్ రాజర్షిషా మైసా కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. రష్మిక మందన్న భావోద్వేగ పోస్ట్ వైరల్! ఎంపీ వంశీకృష్ణను అవమానించే రాజకీయాలు మానుకోవాలి - మాల మహానాడు నాయకుల హెచ్చరిక

ప్రకృతి సాగుతోనే రైతులకు భరోసా - కలెక్టర్ రాజర్షిషా

Select Suryaa Now
ప్రకృతి సాగుతోనే రైతులకు భరోసా - కలెక్టర్ రాజర్షిషా
సూర్య బేల : ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గి, వాతావరణ మార్పులను తట్టుకుని మెరుగైన దిగుబడులు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం బేల  మండలములోని చాంద్‌పల్లి గ్రామంలో సీపీఎఫ్ సంస్థ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై సూచనలు, సలహాలు అందజేశారు.ముందుగా సిపిఎఫ్ సహకారంతో దగాజీ  రైతు సాగు చేస్తున్న పంటలను, ఎరువు తయారీ, పంట నమోదును క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వ్యవసాయ విధానాల గురించి అధికారులను, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యానవన పంటలతో పాటు పత్తిలోనూ జీవామృతం, నీమాస్త్రం వినియోగిస్తూ ప్రకృతి సాగు చేస్తున్న స్థానిక రైతులను అభినందించారు. జిల్లాలోని 30 క్లస్టర్లలో బయో రిసోర్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఒక్కో కేంద్రానికి రూ.లక్ష విలువైన పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి సాగు చేసే రైతులకు, వరద బాధితులకు ఉద్యానవన శాఖ ద్వారా పనస, మునగ, వెదురు మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 35 నుంచి 36 శాతం వర్షపాతం లోటు నమోదైన నేపథ్యంలో, పంట నష్టంపై వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి మొబైల్ యాప్‌లో నమోదు చేస్తున్నారని వివరించారు. జిల్లాలోని 101 క్లస్టర్లలో సాగుతున్న ఈ ప్రక్రియకు రైతులు సహకరించి ఏఈఓల వద్ద వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున పత్తి తొలగించిన తర్వాత జొన్న, మొక్కజొన్నకు బదులుగా తక్కువ నీటితో త్వరగా పండే శనగ, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యానవన పంటలను సాగు చేయాలని కోరారు. పంటల అనంతరం ఖాళీగా ఉన్న పొలాల్లో వీబీజీ రాంజీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 125 రోజుల పని కల్పిస్తామని, దీనివల్ల ఏడాదికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి పంట కుంటలు, ఊటకుంటలు, పొలం బాటలు, ఇంకుడు గుంతలు, పశువుల తొట్టెలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించుకోవాలని సూచించారు. బేల  మండలంలో త్వరలోనే కస్టమ్ హైరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పత్తి ఏరివేత తర్వాత కట్టెలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతింటుందని, వాటిని కాల్చకుండా పొలంలోనే కలియదున్నాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం  ప్రారంభిస్తున్న 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం'లో 18 నుంచి 59 ఏళ్ల వయసు గల వారందరూ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో నిర్వహించే శిబిరాలకు రేషన్ కార్డు, ఆధార్, మొబైల్ నంబర్‌తో హాజరై వివరాలు నమోదు చేయిస్తే రూ.5 లక్షల బీమా రక్షణ లభిస్తుందని చెప్పారు.అనంతరం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించి, ఫుడ్ సెక్యూరిటీ, కన్సర్వేషన్ ప్రాజెక్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ తదుపరి  రైతును కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, ఈడి ఎస్సీ కార్పొరేషన్ మనోహర్, డీహెచ్‌ఎస్‌ఓ దిలీప్ కుమార్, ఇంచార్జి డిఏఓ శ్రీధర్, ఎంపీడీఓ మహేష్ కుమార్, తహ సిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంఏఓ సాయి తేజ రెడ్డి, శాస్త్రవేత్తలు, సర్పంచ్ కోరంగే మంగళ , సీపీఎస్ సంస్థ డైరెక్టర్ గిరిజా, సంస్థ ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, రైతులు,  అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.