BREAKING
బీఎస్-6 వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ గడువు పెంపు శ్రీలంకలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు భారత్ ఇటలీ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం 20 బిలియన్ యూరోలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరా ధరలపై కలెక్టర్ సమీక్ష కావ్య మారన్ కోసం పెళ్లి వేడుకలో అనిరుధ్ పాట.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ! ఏపీఎన్జీవోస్ ఆధ్వర్యంలో 504 మంది మహిళా ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు శ్రీలంక 2027 బడ్జెట్ రుణ తగ్గింపు బాటలోనే.. ఫిచ్ రేటింగ్స్ కీలక అంచనాలు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి - మండల వైద్యాధికారి ఎరువుల కొనుగోలుకు ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ తప్పనిసరి మహిళా సాధికారతకు సింగరేణి చేయూత గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 మూడవ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* ప్రకృతి సాగుతోనే రైతులకు భరోసా - కలెక్టర్ రాజర్షిషా మైసా కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. రష్మిక మందన్న భావోద్వేగ పోస్ట్ వైరల్! ఎంపీ వంశీకృష్ణను అవమానించే రాజకీయాలు మానుకోవాలి - మాల మహానాడు నాయకుల హెచ్చరిక

గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 మూడవ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

Select Suryaa Now
గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 మూడవ  విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..*  *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*


కర్నూలు, నవంబర్ 19 :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 మూడవ విడత ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిందని, కర్నూలు జిల్లాలో మూడవ విడతలో 9 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి తెలిపారు.

*ఎన్నికల షెడ్యూల్ వివరాలు:*

- *నవంబర్ 21 నుండి 23 వరకు:* నామినేషన్ల స్వీకరణ.

- *నవంబర్ 24:* ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.

- *నవంబర్ 25:* సాయంత్రం 5 గంటల వరకు తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్లకు అవకాశం.

- *నవంబర్ 26:* అప్పీళ్ల పరిష్కారం.

- *నవంబర్ 27:* మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం.

- *నవంబర్ 27:* మధ్యాహ్నం 3 గంటల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన.

- *డిసెంబర్ 2*:ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్.

- *డిసెంబర్ 2:* మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనతో పాటు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహణ.

- *డిసెంబర్ 3:* అవసరమైన ప్రాంతాల్లో రీపోలింగ్, అనంతరం ఫలితాల ప్రకటన.


*కర్నూలు జిల్లాలో మూడవ విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల వివరాలు :*

కర్నూలు జిల్లాలో మూడవ విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మొత్తం 9 మండలాల్లో జరగనున్నాయని, కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని సి బెళగల్, గూడూరు, కోడుమూరు, కర్నూలు రూరల్, వెల్దుర్తి  మండలాలు, పత్తికొండ రెవెన్యూ డివిజన్ లోని కృష్ణగిరి, మద్దికెర, పత్తికొండ,  తుగ్గలి మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ తెలిపారు.