BREAKING
బీఎస్-6 వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ గడువు పెంపు శ్రీలంకలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు భారత్ ఇటలీ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం 20 బిలియన్ యూరోలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరా ధరలపై కలెక్టర్ సమీక్ష కావ్య మారన్ కోసం పెళ్లి వేడుకలో అనిరుధ్ పాట.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ! ఏపీఎన్జీవోస్ ఆధ్వర్యంలో 504 మంది మహిళా ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు శ్రీలంక 2027 బడ్జెట్ రుణ తగ్గింపు బాటలోనే.. ఫిచ్ రేటింగ్స్ కీలక అంచనాలు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి - మండల వైద్యాధికారి ఎరువుల కొనుగోలుకు ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ తప్పనిసరి మహిళా సాధికారతకు సింగరేణి చేయూత గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 మూడవ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* ప్రకృతి సాగుతోనే రైతులకు భరోసా - కలెక్టర్ రాజర్షిషా మైసా కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. రష్మిక మందన్న భావోద్వేగ పోస్ట్ వైరల్! ఎంపీ వంశీకృష్ణను అవమానించే రాజకీయాలు మానుకోవాలి - మాల మహానాడు నాయకుల హెచ్చరిక

టిడ్కో గృహాల అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకు రుణాల విడుదల, రిజిస్ట్రేషన్, మార్టిగేజ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*

Select Suryaa Now
టిడ్కో గృహాల అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకు రుణాల విడుదల, రిజిస్ట్రేషన్, మార్టిగేజ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి*  *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*

 

కర్నూలు,నవంబర్:19: టిడ్కో గృహాలకు సంబంధించి  లబ్ధిదారులకు బ్యాంకు రుణాల విడుదల, మౌలిక వసతుల కల్పన,రిజిస్ట్రేషన్, మార్టిగేజ్ ప్రక్రియలో ఉన్న పెండింగ్ అంశాలను ప్రాధాన్యతతో పరిష్కరించి, పూర్తయిన గృహాలను లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రానున్న 10 రోజుల్లో స్పష్టమైన పురోగతి సాధించాలని  కలెక్టర్ స్పష్టం చేశారు.

గురువారం కలెక్టరేట్ లో మున్సిపల్ కమిషనర్లు, బ్యాంకు అధికారులు, టిడ్కో, మెప్మా అధికారులతో టిడ్కో గృహాల నిర్మాణ పురోగతి, బ్యాంకు రుణాల విడుదల, ఎన్‌పీఏలు, రిజిస్ట్రేషన్, మార్టిగేజ్, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో టిడ్కో గృహాలకు సంబంధించి మొత్తం 6,999 గృహాలు లక్ష్యంగా ఉండగా, ఇప్పటివరకు 4,135 గృహాలకు సంబంధించి బ్యాంకు రుణాలు విడుదలయ్యాయని, ఇందులో 2,422 గృహాలకు పూర్తి స్థాయిలో, 1,493 గృహాలకు పాక్షికంగా రుణాలు విడుదలయ్యాయని తెలిపారు. మిగిలిన అర్హులైన లబ్ధిదారులకు రుణాలు విడుదలయ్యేలా బ్యాంకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టిడ్కో గృహాలకు సంబంధించి పెయింటింగ్, ఇంటర్నల్ ఫ్లోరింగ్, తలుపులు, కిటికీలు, విద్యుత్ వైరింగ్, ప్లంబింగ్ తదితర నిర్మాణ పనుల పూర్తిస్థాయి వివరాలను మున్సిపాలిటీల వారీగా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. టిడ్కో గృహ సముదాయాల్లో తాగునీటి సరఫరా, అంతర్గత పైప్‌లైన్లు, విద్యుత్, వీధి దీపాలు, రహదారులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ తదితర మౌలిక వసతుల స్థితిగతులపై కలెక్టర్ సమీక్షించారు. ఒక ప్రాంతంలో ఎలివేటెడ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినప్పటికీ, నిలువు పైప్‌లైన్లు, పంపింగ్ మోటార్ల ఏర్పాటు తదితర పనులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు వివరించగా, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి తాగునీటి సరఫరా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

*రిజిస్ట్రేషన్, మార్టిగేజ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

పూర్తి స్థాయిలో రుణాలు విడుదలైన గృహాల్లో ఇప్పటివరకు సుమారు 2,049 గృహాలకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని అధికారులు వివరించగా, మిగిలిన గృహాలకు కూడా రిజిస్ట్రేషన్, మార్టిగేజ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి రోజుకు కనీసం 10 నుంచి 15 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. బ్యాంకులు, మెప్మా, మున్సిపల్, టిడ్కో అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. నిర్మాణ పనులు పూర్తయిన గృహాలను గుర్తించి, అవసరమైన మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గృహాలు అప్పగించినప్పటికీ నివాసం ఉండని లబ్ధిదారుల వివరాలను పరిశీలించి, అందుకు గల కారణాలను తెలుసుకోవాలని, నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు తమ గృహాల్లో నివాసం ఉండేందుకు అనుకూలమైన అన్ని సౌకర్యాలు కల్పించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

గత సమావేశంలో సూచించిన అంశాలపై సాధించిన పురోగతితో పాటు, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణాలు, రుణాల విడుదల, ఎన్‌పీఏలు, మౌలిక వసతులు, రిజిస్ట్రేషన్, మార్టిగేజ్‌కు సంబంధించి వాస్తవ గణాంకాలతో కూడిన సమగ్ర నివేదికలు సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పెండింగ్ అంశాలకు బాధ్యులైన అధికారులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, పూర్తి చేయాల్సిన గడువును నివేదికల్లో స్పష్టంగా పేర్కొనాలన్నారు. రానున్న 10 రోజుల్లో అన్ని అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపించాలని, తదుపరి సమీక్ష సమావేశం నాటికి పెండింగ్ సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, టిడ్కో ఈఈ రవికుమార్ గుప్తా, ఎల్‌డీఎం మోహన్,  మెప్మా పీడీ శ్రీనివాసులు,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి కుమార్ గుప్తా, సి. ఎల్. టి. సి డాక్టర్ పెంచలయ్య, , బ్యాంక్ అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదోని, ఎమ్మిగనూరు, కమిషనర్లు పాల్గొన్నారు.