అమెజాన్‌లో విజ్ఞాన్స్ లారా విద్యార్థినికి ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ.1.30 లక్షల వేతనం
గుంటూరు: గుంటూరు జిల్లా చెబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ లారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో నాలుగో సంవత్సరం బీటెక్ చదువుతున్న టి. మానస అనే విద్యార్థిని ప్రముఖ అంతర్జాతీయ సాంకేతిక సంస్థ అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఇంటర్న్‌గా ఎంపికై నెలకు రూ.1,30,000 వేతనం పొందనున్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.ఫణీంద్ర కుమార్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తిచేసిన అనంతరం ఏడాదికి రూ.44 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగ అవకాశం పొందనున్నట్లు తెలిపారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఉద్యోగావకా శాలను సాధించేలా కళాశాలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందిం చడంతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగు ణంగా వారిని తీర్చిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు కోడింగ్‌పై పట్టు సాధించేలా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కోడ్‌చెఫ్, హ్యాకర్‌రాంక్, హ్యాకర్‌ఎర్త్, లీట్‌కోడ్ వంటి అంతర్జాతీయ కోడింగ్ వేదికల ద్వారా నిరంతరం ప్రాక్టీస్ చేయిస్తున్నామని వివరించారు. కోడింగ్, హ్యాకథాన్ వంటి సాంకేతిక పోటీల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తు న్నామని పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకు నేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలను పెంపొందిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టుల ఆధారిత శిక్షణతో పాటు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు అవసరమైన ప్రత్యేక తర్ఫీదు అందిస్తున్నట్లు వెల్లడించారు.అమెజాన్‌లో అత్యుత్తమ ఉద్యోగావ కాశాన్ని సాధించిన టి. మానసను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవ రాయలు, సీఈఓ డాక్టర్ మేఘన కూరపాటి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. ఫణీంద్ర కుమార్, శిక్షణ, ఉపాధి కల్పన విభాగం అధికారులు, డీన్లు, వివిధ విభాగాధిపతులు ఎంపికైన విద్యార్థిని అభినందించారు.
సూర్య నాయక్