BREAKING
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు హత్య బెదిరింపులు ఐపీఎల్ 2027 మినీ వేలంలో ఈ ఆటగాళ్లపై కాసుల వర్షం.. ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ! ఎంపీటీసీల విజయం ప్రజల నమ్మకానికి నిదర్శనం: పార్టీలకతీతంగా ధర్మవరం మండల అభివృద్ధికి కృషి చేస్తాం — నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి తైవాన్ విషయంలో అమెరికా సరైన నిర్ణయం తీసుకోవాలి తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. అకెర్‌మన్ సెంచరీ, హార్మర్ ఆరు వికెట్లు! అమెరికా ఐపీఓ మార్కెట్‌లో రికార్డు నిధులు బైక్ ప్రమాదంలో కామన్వెల్త్ స్వర్ణ విజేతకు తీవ్ర గాయాలు.. చేయి కోల్పోయిన వెయిట్‌లిఫ్టర్! ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలి జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు. - డీఎస్పీ నరసింహారావు పడిక్కల్, పంత్ గందరగోళం.. చేతికందిన వికెట్ జారవిడవడంతో కెప్టెన్ గిల్ ఆగ్రహం! సీఎం సభకు రాయలపూర్ కాంగ్రెస్ శ్రేణుల భారీ తరలింపు అమెరికా సెక్యూరిటీస్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీ నామినీలకు సెనేట్ పరీక్ష మండల స్థాయి చిత్రలేఖన పోటీలో జాహ్నవి రెడ్డికి ప్రథమ స్థానం అమెజాన్‌లో విజ్ఞాన్స్‌ లారా విద్యార్థినికి ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ.1.30 లక్షల వేతనం తొలి టెస్ట్‌లో సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. ఏమన్నారంటే!

జనగణనను సమర్థవంతంగా పూర్తి చేయాలి : నగర కమిషనర్

Select Suryaa Now
జనగణనను సమర్థవంతంగా పూర్తి చేయాలి : నగర కమిషనర్

గుంటూరు : జనగణన-2027లో భాగంగా రెండో దశలో నిర్వహించనున్న జనాభా గణన ప్రక్రియను గుంటూరు నగరంలో పకడ్బందీగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని మిని శంకరన్ హాల్లో ఫీల్డ్ ట్రైనర్లకు నిర్వహించే శిక్షణ తరగతుల్లో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జనవరి 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ప్రక్రియకు అవకాశం ఉంటుందని, జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఇంటింటి జనాభా గణన నిర్వహించ నున్నట్లు తెలిపారు. అనంతరం మార్చి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పునఃపరిశీలన ప్రక్రియ కొనసాగుతుంద న్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న ఫీల్డ్ ట్రైనర్లు, తదుపరి సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు డిసెంబర్ రెండో వారంలో శిక్షణ అందించవలసి ఉంటుందన్నారు. జనగణన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి అంశంపై పూర్తి అవగాహనతో శిక్షణ పొందాలని సూచించారు. జనగణన దేశ అభివృద్ధికి అవసరమైన కీలకమైన సమాచార సేకరణ ప్రక్రియ కావడంతో అధికారులు, సిబ్బంది బాధ్యతా యుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఐ.కిషోర్, డిప్యూటీ కమిషనర్లు జి.సాంబశివ రావు, బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సెన్సెస్ అధికారులు ప్రసన్న కుమార్, ఆది లక్ష్మి,రమణ పాల్గొన్నారు 

 

సూర్య నాయక్