BREAKING
ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలి జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు. - డీఎస్పీ నరసింహారావు పడిక్కల్, పంత్ గందరగోళం.. చేతికందిన వికెట్ జారవిడవడంతో కెప్టెన్ గిల్ ఆగ్రహం! సీఎం సభకు రాయలపూర్ కాంగ్రెస్ శ్రేణుల భారీ తరలింపు అమెరికా సెక్యూరిటీస్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీ నామినీలకు సెనేట్ పరీక్ష మండల స్థాయి చిత్రలేఖన పోటీలో జాహ్నవి రెడ్డికి ప్రథమ స్థానం అమెజాన్‌లో విజ్ఞాన్స్‌ లారా విద్యార్థినికి ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ.1.30 లక్షల వేతనం తొలి టెస్ట్‌లో సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. ఏమన్నారంటే! సరిహద్దు ఉగ్రవాదంపై ఉక్కుపాదం ఎల్ నినో ప్రభావంతో ఆరుతడి పంటలు సాగుపై రైతులకు అవగాహన అధిక ప్రమాద గర్భిణులను ముందస్తుగా గుర్తించాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ జనగణనను సమర్థవంతంగా పూర్తి చేయాలి : నగర కమిషనర్ ఎస్‌ఐఆర్-2026 గడువు పొడిగింపు – నవంబర్ 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరణ. భారత్‌పై నికోల్స్ అద్వితీయ శతకం.. కేన్ విలియమ్సన్ రికార్డుల బద్దలు! నగరం ఎంపీపీగా మోర్ల స్వరూపరాణి - ఉపాధ్యక్షులుగా చింతల కళ్యాణి

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నూతన ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పెరుగు నాగలక్ష్మి రెడ్డి

Select Suryaa Now
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నూతన ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పెరుగు నాగలక్ష్మి రెడ్డి

ప్రజల ఆశీస్సులతో గెలిచా... అండగా ఉంటా- ఎంపీపీ పి ఎన్ రెడ్డి 
- ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన పెరుగు నాగలక్ష్మి రెడ్డి 
ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో గెలిచానని నమ్మకంతో ఆదరించిన ప్రజలకు అండగా ఉండి సేవకుడిలా పని చేస్తానని నూతన ఎంపీపీ పెరుగు నాగలక్ష్మి రెడ్డి అన్నారు. గురువారం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పాత మాడుగుల గ్రామానికి చెందిన వైసిపి యువ నాయకులు నూతన ఎంపీపీ పెరుగు నాగలక్ష్మి రెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించాలని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని అన్నారు. ఎంపీటీసీ సభ్యుల అందరి సమన్వయంతో ప్రజలతో మమేకమై గ్రామాల రూపురేఖలు మారుస్తామన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి ప్రజలకు నాయకుడిగా కాకుండా సేవకుడిగా సేవలందిస్తానని ప్రజల కోసం సైనికుల పనిచేసి కొత్తపల్లి మండలం ఎంపీపీగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీపీగా ప్రమాణస్వీకారం చేసిన పెరుగు నాగలక్ష్మి రెడ్డికి వైసీపీ శ్రేణులు, అభిమానులు, ఆయా గ్రామాల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.