ఎల్ నినో ప్రభావంతో ఆరుతడి పంటలు సాగుపై రైతులకు అవగాహన
రామాయంపేట ; రామాయంపేట మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ నవీన్ గౌడ్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావం, వర్షపాత పరిస్థితులు, వ్యవసాయంపై వాటి ప్రభావం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగును చేపట్టాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసుకునే పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పంట నష్టాలను నివారించవచ్చని వివరించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ రైతులు పంటల సాగుపై తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు