బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి
సూర్య- బిక్కనూర్ : బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని, వారికి ఏ ఆపద వచ్చిన ముందు వరుసలో ఉంటానని,బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి గంప శశాంక్ చెప్పారు. గురువారం మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన రామగళ్ళ వర్గేష్ అనే యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయాన్ని తెలుసుకొని, ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరీక్షల నిమిత్తం తక్షిణ సహాయం కింద 15 వేల రూపాయల నగదును అందజేశాడు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బుర్రి గోపాల్, పార్టీ యూత్ విభాగపు మండల అధ్యక్షుడు రంజిత్ వర్మ,సొసైటీ చైర్మన్ మద్ది స్వామి, మాజీ ఉపసర్పంచ్ బిక్షపతి, పార్టీ సీనియర్ నాయకులు గౌరీగారి రాజిరెడ్డి, ఉప సర్పంచ్ కార్తీకరెడ్డి, నాయకులు సిద్ధిరామిరెడ్డి, బాలా గౌడ్ యూత్ నాయకులు పాల్గొన్నారు