BREAKING
ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలి జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు. - డీఎస్పీ నరసింహారావు పడిక్కల్, పంత్ గందరగోళం.. చేతికందిన వికెట్ జారవిడవడంతో కెప్టెన్ గిల్ ఆగ్రహం! సీఎం సభకు రాయలపూర్ కాంగ్రెస్ శ్రేణుల భారీ తరలింపు అమెరికా సెక్యూరిటీస్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీ నామినీలకు సెనేట్ పరీక్ష మండల స్థాయి చిత్రలేఖన పోటీలో జాహ్నవి రెడ్డికి ప్రథమ స్థానం అమెజాన్‌లో విజ్ఞాన్స్‌ లారా విద్యార్థినికి ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ.1.30 లక్షల వేతనం తొలి టెస్ట్‌లో సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. ఏమన్నారంటే! సరిహద్దు ఉగ్రవాదంపై ఉక్కుపాదం ఎల్ నినో ప్రభావంతో ఆరుతడి పంటలు సాగుపై రైతులకు అవగాహన అధిక ప్రమాద గర్భిణులను ముందస్తుగా గుర్తించాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ జనగణనను సమర్థవంతంగా పూర్తి చేయాలి : నగర కమిషనర్ ఎస్‌ఐఆర్-2026 గడువు పొడిగింపు – నవంబర్ 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరణ. భారత్‌పై నికోల్స్ అద్వితీయ శతకం.. కేన్ విలియమ్సన్ రికార్డుల బద్దలు! నగరం ఎంపీపీగా మోర్ల స్వరూపరాణి - ఉపాధ్యక్షులుగా చింతల కళ్యాణి

అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

Select Suryaa Now
అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి  హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

హుస్నాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గాదెపాక రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపైనా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపైనా అధికారులతో లెక్కలు తీయించి ప్రజల ముందు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలనే అభివృద్ధి చేశారని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఆ మూడు నియోజకవర్గాల్లో సభలు పెట్టి బీఆర్ఎస్‌ను ఓడిస్తామని చెప్పడం సరికాదని రవీందర్ అన్నారు. అభివృద్ధిని చూసిన ప్రజలు వారిని ఏ విధంగా ఓడిస్తారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ ఇంకా చాలా కుటుంబాలకు అందడం లేదని, మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం హామీల ఊసే లేదని విమర్శించారు. రైతులకు రూ. 5 లక్షల రైతు బీమాను అందించలేకపోయారని అన్నారు. పెన్షన్లు రెట్టింపు చేస్తామని చెప్పి మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయలేదని, అర్హులైన వృద్ధులు, చేనేత కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని రవీందర్ పేర్కొన్నారు. మంజూరైన పెన్షన్ల పంపిణీని కూడా 19వ తేదీ నుంచి 26వ తేదీకి వాయిదా వేశారని, ప్రభుత్వం వద్ద బడ్జెట్ ఉంటే ఈ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టి, పాత పనులకే ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం అగ్ర నాయకులను విమర్శించడానికే పరిమితం కాకుండా, శంకుస్థాపన చేసిన పనులను పూర్తి చేసి, ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు.