మండల స్థాయి చిత్రలేఖన పోటీలో జాహ్నవి రెడ్డికి ప్రథమ స్థానం
రామాయంపేట ; చైల్డ్ రైట్స్ వీక్ – 2026 సందర్భంగా మండల స్థాయిలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలో రామాయంపేట వివేకానంద విద్యాలయానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని జాహ్నవి రెడ్డి ప్రథమ స్థానాన్ని సాధించి జిల్లా స్థాయి పోటీకి ఎంపికైంది.“బాలల హక్కులు – పరిరక్షణ” అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీలో జాహ్నవి రెడ్డి తన ప్రతిభను చాటుకుని ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలో ఆమె పాల్గొననుంది.ఈ సందర్భంగా జాహ్నవి రెడ్డిని మండల విద్యాధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ. రామ్‌కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లా స్థాయి పోటీలోనూ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.