సీఎం సభకు రాయలపూర్ కాంగ్రెస్ శ్రేణుల భారీ తరలింపు
రామాయంపేట :రామాయంపేట మండలం పరిధిలోని రాయలపూర్ గ్రామం నుంచి ముఖ్యమంత్రి సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. గ్రామ సర్పంచ్ గట్టు సుశీల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సభకు బయలుదేరారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సంఘీభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు