బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు హత్య బెదిరింపులు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. బాబా సిద్ధిఖీ తరహాలోనే ఆయనను కూడా అంతమొందిస్తామంటూ జీషన్ అక్తర్ పేరిట ఒక బెదిరింపు వాయిస్ మెసేజ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, గతంలో బాలీవుడ్ నటులు తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలకు కూడా ఇదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. సెలబ్రిటీల భద్రతను తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, ఈ వాయిస్ మెసేజ్‌ను నిజంగా నిందితుడే పంపాడా లేక ఎవరైనా అతని పేరును వాడుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారా అనే కోణంలో పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ జరుపుతున్నారు.