తిమ్మాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ -
సూర్య చందుర్తి ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు.చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆరా తీశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సరిపడా తేమ శాతం వచ్చిన తర్వాతే తూకం వేయాలని సూచించారు. సేకరించిన ధాన్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.పరిశీలనలో తహసీల్దార్ భూపతి, తదితరులు ఉన్నారు.