సోషల్ మీడియా వేధింపులపై డాక్టర్ బొత్స అనూషకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న వేధింపులు, ట్రోలింగ్‌పై డాక్టర్ బొత్స అనూష తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా కొందరు ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెడుతున్నారని ఆమె న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్‌ను ట్రోల్ చేస్తూ రూపొందించిన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తక్షణమే తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ వేధింపులకు పాల్పడిన బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది.