BREAKING
57వ ఇఫీ ముగింపు చిత్రంగా ఆంథోనీ చెన్ ‘వీ ఆర్ ఆల్ స్ట్రేంజర్స్’ అనకాపల్లి ఎంపీపీగా బొడ్డపాటి నారాయణమ్మ ఎంపిక. పుట్టగొడుగుల పెంపకంపై ఉచిత శిక్షణ రామళ్లకోట సర్పంచ్ బరిలో మంచిరెడ్డి మౌనిక టీడీపీ నాయకుడు శశికళధరప్ప (శశి) కుటుంబం నుంచి అభ్యర్థిత్వం జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే జాప్ ప్రధాన లక్ష్యం! జర్నలిస్టుల హక్కుల సాధనకు నిరంతర పోరాటం చేస్తాం ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తపోవనం బుద్ధిమాంద్య ఆశ్రమంలో కేక్ కట్ చేసి, పండ్ల పంపిణీ.. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జర్నలిస్టు నేతలు జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే జాప్ ప్రధాన లక్ష్యం! జర్నలిస్టుల హక్కుల సాధనకు నిరంతర పోరాటం చేస్తాం ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తపోవనం బుద్ధిమాంద్య ఆశ్రమంలో కేక్ కట్ చేసి, పండ్ల పంపిణీ.. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జర్నలిస్టు నేతలు 83 వేలు దాటిన సెన్సెక్స్, 25,500 పైకి చేరిన నిఫ్టీ విశ్వక్ సేన్ కల్ట్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే! దీపికా పదుకొణె డిమాండ్‌కు ఆలియా భట్ మద్దతు.. సెట్స్‌లో మహిళలకు కనీస సౌకర్యాలపై కీలక వ్యాఖ్యలు! తైక్వాండోలో పసిడి పతకాల పంట.. జాతీయ స్థాయికి పాత మంచిర్యాల క్రీడాకారులు! కార్పొరేట్ విద్యా సంస్థల లాభాల కోసం విద్యార్థులను బలి చేయడం సరికాదు .. చెప్పేదొకటి ఫీజులు వసూళ్లలో ఆచరించేది ఒకటి. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బీఎస్-6 వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ గడువు పెంపు శ్రీలంకలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు భారత్ ఇటలీ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం 20 బిలియన్ యూరోలు

ఏపీఎన్జీవోస్ ఆధ్వర్యంలో 504 మంది మహిళా ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు

Select Suryaa Now
ఏపీఎన్జీవోస్ ఆధ్వర్యంలో 504 మంది మహిళా ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు

గుంటూరు : ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల కోసం నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మెగా వైద్య శిబిరం గురువారం విజయ వంతంగా ముగిసింది. ఈ నెల 16 నుండి 19వ తేదీ వరకు గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్ సెంటర్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ శిబిరంలో 30 నుండి 65 ఏళ్ల వయసు గల 504 మంది మహిళా ఉద్యోగులకు గర్భాశయ ముఖద్వార (సెర్వికల్), రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 45 మందికి వ్యాధి లక్షణాలు (పాజిటివ్) ఉన్నట్లు ప్రాథమిక దశలోనే గుర్తించి, తక్షణ వైద్య సేవలతో పాటు తగు సూచనలు అందజేశారు. అమెరికాకు చెందిన 'పింక్ ఆర్గనైజేషన్' వైద్య నిపుణులు డాక్టర్ సమత కడియాల, డాక్టర్ కరూర్ హబాక్, డాక్టర్ మెరిస్సా మిస్ కాల్ బృందం ఈ పరీక్షలు నిర్వహించగా, వారి సేవలను గుర్తించి సంఘం తరఫున ఘనంగా సన్మానించారు. అలాగే సహకరించిన ప్రివెంటివ్ ఆంకాలజీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ మొహసీనా, రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్‌లకు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ​శిబిరం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన తాజున్నిసా ఆధ్వర్యంలోని మహిళా నాయకులను ఏపీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు, కార్యదర్శి ఆరాధ్యుల శ్యామ్ సుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ నాగూర్ షరీఫ్, నగర అధ్యక్షుడు చింతల కళ్యాణ్ కుమార్, నగర కార్యదర్శి జె.వి. కోటేశ్వరరావు అభినందించారు. ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకు భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.

 

సూర్య నాయక్