BREAKING
బీఎస్-6 వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ గడువు పెంపు శ్రీలంకలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు భారత్ ఇటలీ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం 20 బిలియన్ యూరోలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరా ధరలపై కలెక్టర్ సమీక్ష కావ్య మారన్ కోసం పెళ్లి వేడుకలో అనిరుధ్ పాట.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ! ఏపీఎన్జీవోస్ ఆధ్వర్యంలో 504 మంది మహిళా ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు శ్రీలంక 2027 బడ్జెట్ రుణ తగ్గింపు బాటలోనే.. ఫిచ్ రేటింగ్స్ కీలక అంచనాలు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి - మండల వైద్యాధికారి ఎరువుల కొనుగోలుకు ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ తప్పనిసరి మహిళా సాధికారతకు సింగరేణి చేయూత గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 మూడవ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* ప్రకృతి సాగుతోనే రైతులకు భరోసా - కలెక్టర్ రాజర్షిషా మైసా కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. రష్మిక మందన్న భావోద్వేగ పోస్ట్ వైరల్! ఎంపీ వంశీకృష్ణను అవమానించే రాజకీయాలు మానుకోవాలి - మాల మహానాడు నాయకుల హెచ్చరిక

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్

Select Suryaa Now
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు, యువతలో పఠనాసక్తిని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, ఆలోచనా శక్తి, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని తెలిపారు. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో కూడా పుస్తక పఠనానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, విద్యార్థులు ప్రతిరోజూ కొంత సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించాలని సూచించారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులతో గ్రంథాలయ ప్రాంగణంలో నిర్వహించిన రంగుల పోటీ  (ముగ్గుల) పోటీలను ఆమె అభినందించారు. ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు కళాత్మక ఆలోచనలు, సృజనాత్మకతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. చదువుతో పాటు సాంస్కృతిక, కళా రంగాల్లోనూ విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేందుకు, వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు గ్రంథాలయ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య సుజాత మేడం, అన్నపూర్ణ , గ్రంథాలయ కార్యదర్శి సురేష్ బాబు  గ్రంథాలయ అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.