telangana
గొర్రెలు మేకలకు మశూచి నివారణ టీకాల పంపిణీ - పశువైద్యాధికారి. రాథోడ్ జీవన్
సూర్య.నేరడిగొండ : మండలంలోని వడూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని భవాని తండాలో గురువారం గొర్రెలు,మేకలకు మశూచి వ్యాధి నివారణ ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పశువైద్యాధికారి డాక్టర్ రాథోడ్ జీవన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆడెపు శ్రీకాంత్ దగ్గరుండి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గొర్రెల్లో మశూచి వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తగా టీకాలు వేయించడం ఎంతో అవసరమని అన్నారు. గొర్రెలకు మేకలకు టీకాలను వేయించడం వలన వ్యాధుల ముప్పును ,జీవాల ప్రాణాలను కాపాడవచ్చని, తద్వారా గొర్రెల కాపరులకు ఆర్థిక నష్టాలు కలగకుండా నివారించవచ్చని సర్పంచ్ శ్రీకాంత్ అన్నారు. అనంతరం పశుసంవర్ధక శాఖ వైద్య సిబ్బంది గ్రామంలోని గొర్రెల మందలన్నింటికీ ఉచితంగా టీకాలు వేశారు. ఈ ఉచిత టీకాల కార్యక్రమాన్ని గొర్రెల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ వైద్య సిబ్బంది, గ్రామస్తులు, గొర్రెలు, మేకల కాపరులు తదితరులు పాల్గొన్నారు.