BREAKING
గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 మూడవ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* ప్రకృతి సాగుతోనే రైతులకు భరోసా - కలెక్టర్ రాజర్షిషా మైసా కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. రష్మిక మందన్న భావోద్వేగ పోస్ట్ వైరల్! ఎంపీ వంశీకృష్ణను అవమానించే రాజకీయాలు మానుకోవాలి - మాల మహానాడు నాయకుల హెచ్చరిక అందుబాటులో ఉండాలి.. మెరుగైన వైద్యం అందించాలి..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ టిడ్కో గృహాల అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకు రుణాల విడుదల, రిజిస్ట్రేషన్, మార్టిగేజ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* ఇందిరమ్మ బీమా పథకం తప్పులు లేకుండా నమోదు చేయాలి - ఎడిట్‌ ఆప్షన్‌ లేనందున అప్రమత్తంగా ఉండాలి - కలెక్టర్‌ రాజర్షిషా మంత్రి పయ్యావుల కేశవ్ ను కలసిన జడ్పిటిసి శ్రీరాములు. సోషల్ మీడియా వేధింపులపై డాక్టర్ బొత్స అనూషకు హైకోర్టులో ఊరట గొర్రెలు మేకలకు మశూచి నివారణ టీకాల పంపిణీ - పశువైద్యాధికారి. రాథోడ్ జీవన్ కూతురి విడాకుల పుకార్లపై నటుడు అర్జున్ సర్జా స్పందన.. తప్పుడు వార్తలపై ఆగ్రహం! నాగరాజు రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయి.. వైస్ ఎంపీపీగా ఎన్నికవడంపై హర్షం వ్యక్తం చేసిన శాసనకోట మహేష్! ట్రావిస్ హెడ్‌కు గస్ అట్కిన్సన్ దడ.. వరుసగా మూడు వన్డేల్లో ఔట్!

టైమ్100 నెక్ట్స్ ఇండియా జాబితాలో వైభవ్ సూర్యవంశీ.. శుభాంశు శుక్లా, ఆర్యన్ ఖాన్‌లకు చోటు!

Select Suryaa Now
టైమ్100 నెక్ట్స్ ఇండియా జాబితాలో వైభవ్ సూర్యవంశీ.. శుభాంశు శుక్లా, ఆర్యన్ ఖాన్‌లకు చోటు!

సూర్య స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ తొలిసారిగా విడుదల చేసిన టైమ్100 నెక్ట్స్ ఇండియా జాబితాలో పలువురు యువ ప్రతిభావంతులకు అరుదైన గుర్తింపు లభించింది. క్రికెట్‌లో సంచలనం రేపుతున్న వైభవ్ సూర్యవంశీతో పాటు అంతరిక్ష యాత్రికుడు శుభాంశు శుక్లా, ఆర్యన్ ఖాన్, ఆలియా భట్ సహా మొత్తం 100 మంది భారతీయులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. క్రీడలు, సినిమా, సైన్స్, వ్యాపారం, సంగీతం వంటి విభిన్న రంగాల్లో ఎదుగుతున్న కొత్త తరం ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో తొలిసారిగా భారత్ కోసం ప్రత్యేకంగా ఈ జాబితాను రూపొందించారు.

ఈ కార్యక్రమంలో రిలయన్స్ ప్రధాన భాగస్వామిగా వ్యవహరిస్తుండగా, భారత్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో ప్రభావం చూపుతున్న వారిని టైమ్ జర్నలిస్టులు పరిశీలించి ఎంపిక చేశారు. క్రీడల విభాగంలో వైభవ్ సూర్యవంశీతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్, లవ్లీనా బోర్గోహైన్, సానియా మీర్జా, సవితా పునియా వంటి ప్రముఖులు నిలిచారు. వైభవ్ సూర్యవంశీ ప్రయాణం, ప్రతిభ గురించి నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రత్యేకంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

సినిమా, సంగీత రంగాల నుంచి ఆలియా భట్, ఆర్యన్ ఖాన్, సాయి పల్లవి, నయనతార, విక్కీ కౌశల్, ఇషాన్ ఖట్టర్, దిల్జిత్ దోసాంజ్, అనిరుధ్ రవిచందర్ వంటి వారు ఈ జాబితాలో స్థానం సంపాదించారు. వీరితో పాటు సైన్స్, ఆరోగ్య, వ్యాపార రంగాల్లో శుభాంశు శుక్లా, స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన, పీయూష్ బన్సల్, రాధికా గుప్తా, తరుణ్ మెహతా వంటి ప్రముఖులు కూడా గుర్తింపు పొందారు.

టైమ్100 నెక్ట్స్ ఇండియా ప్రత్యేక సంచిక డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. అనంతరం డిసెంబర్ 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రత్యేక వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేదికపై ఎంపికైన పలువురు ప్రముఖులు పాల్గొనడంతో పాటు ప్రత్యేక సంగీత ప్రదర్శన కూడా జరగనుంది.