ఎంపీటీసీల విజయం ప్రజల నమ్మకానికి నిదర్శనం: పార్టీలకతీతంగా ధర్మవరం మండల అభివృద్ధికి కృషి చేస్తాం — నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి
ధర్మవరం రూరల్ నవంబర్ 19 మేజర్ న్యూస్
ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఘన విజయం చేకూర్చిన ధర్మవరం మండల ప్రజలకు తెలుగుదేశం పార్టీ మండల కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ధర్మవరం నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి పేర్కొన్నారు.
గత రెండు సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ; మంత్రి సత్యకుమార్ చొరవ, టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ మార్గదర్శకత్వం, జనసేన ప్రధాన కార్యదర్శి చిలక0 మధుసూదన్ రెడ్డి సహకారంతో ధర్మవరం మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేశామని నేతలు తెలిపారు. సాగునీరు, తాగునీరు, రోడ్ల నిర్మాణం, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలతో మమేకమై పనిచేయడం వల్లే ఈ ఎన్నికల్లో విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు.
ఈ విజయాన్ని చూసి పొంగిపోకుండా, మరింత బాధ్యతతో పనిచేస్తామని నేతలు తెలిపారు. రాబోయే ఐదేళ్ల కాలంలో కూటమి తరఫున ఎంపీపీగా ఎన్నికైన శ్రీనివాస్ ని, అలాగే కూటమిలోని జనసేన, బీజేపీ ఎంపీటీసీలను కలుపుకుని ముందుకు సాగుతామన్నారు. కుల, మత, వర్గ, పార్టీ భేదాలకు అతీతంగా—గెలిచిన చోట, గెలవని చోట కూడా సమాన దృష్టితో చూస్తూ ధర్మవరం మండల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామని టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ తరఫున మండల కమిటీ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసులు మండల ప్రధాన కార్యదర్శి విజయసారథి సింగల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆజాద్ పాల్గొన్నారు
తిరువీధుల రమేష్ నాయుడు
సూర్య రిపోర్టర్
ధర్మవరం రూరల్