BREAKING
ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలి జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు. - డీఎస్పీ నరసింహారావు పడిక్కల్, పంత్ గందరగోళం.. చేతికందిన వికెట్ జారవిడవడంతో కెప్టెన్ గిల్ ఆగ్రహం! సీఎం సభకు రాయలపూర్ కాంగ్రెస్ శ్రేణుల భారీ తరలింపు అమెరికా సెక్యూరిటీస్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీ నామినీలకు సెనేట్ పరీక్ష మండల స్థాయి చిత్రలేఖన పోటీలో జాహ్నవి రెడ్డికి ప్రథమ స్థానం అమెజాన్‌లో విజ్ఞాన్స్‌ లారా విద్యార్థినికి ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ.1.30 లక్షల వేతనం తొలి టెస్ట్‌లో సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. ఏమన్నారంటే! సరిహద్దు ఉగ్రవాదంపై ఉక్కుపాదం ఎల్ నినో ప్రభావంతో ఆరుతడి పంటలు సాగుపై రైతులకు అవగాహన అధిక ప్రమాద గర్భిణులను ముందస్తుగా గుర్తించాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ జనగణనను సమర్థవంతంగా పూర్తి చేయాలి : నగర కమిషనర్ ఎస్‌ఐఆర్-2026 గడువు పొడిగింపు – నవంబర్ 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరణ. భారత్‌పై నికోల్స్ అద్వితీయ శతకం.. కేన్ విలియమ్సన్ రికార్డుల బద్దలు! నగరం ఎంపీపీగా మోర్ల స్వరూపరాణి - ఉపాధ్యక్షులుగా చింతల కళ్యాణి

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే కుట్రను తక్షణమే విరమించుకోవాలి.!

Select Suryaa Now
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే కుట్రను తక్షణమే విరమించుకోవాలి.!

గుంటూరు: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిర్వహించాలని, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పేరుతో ప్రైవేటు యాజమాన్యా లకు అప్పగించాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనలను తక్షణమే విరమించుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో కొత్తపేట మల్లయ్య లింగం భవన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ, జిల్లా కార్యదర్శి యశ్వంత్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకులు కరీం , ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు, పేద, మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టిందని, వాటిలో ఐదు కళాశాలలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన కళాశాలలను కూడా పూర్తిచేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే ప్రజారోగ్యాన్ని, పేద విద్యార్థుల భవిష్యత్తును పక్కనపెట్టి పీపీపీ విధానం పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికే అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పాలకొల్లు, పెనుకొండ, ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు టెండర్లు పిలవడం ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు నిదర్శనమని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా భవిష్యత్తు లో వైద్య విద్య, వైద్య సేవలు సామాన్య ప్రజలకు అందని ద్రాక్షగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించడంతోపాటు, వాటి నిర్వహణ కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో రూ.1,200 కోట్లకు పైగా ప్రజాధనాన్ని కేటాయించాలనే ఆలోచనను వక్తలు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించి, వాటి నిర్వహణకు కూడా ప్రజల పన్నుల డబ్బును ఖర్చు చేయడం ఎవరి ప్రయోజనాల కోసం అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిర్వహించాలని, పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటు ఫీజులతో వైద్య విద్యను అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందిం చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. వైద్య కళాశాలలకు తగిన బడ్జెట్ కేటాయించి వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందిని నియమించాలని, ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజారోగ్యాన్ని ప్రైవేటు వ్యాపార ప్రయోజనాలకు బలిచేయకుండా ప్రభుత్వ వైద్య వ్యవస్థను కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్, గణేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్