BREAKING
శ్రీలంకతో రెండో టెస్ట్‌లో పాక్ పేసర్ సాకిబ్ ఖాన్‌కు గాయం.. బౌలింగ్‌కు దూరం! నికోల్స్ అజేయ శతకం, గ్లెన్ ఫిలిప్స్ మెరుపులు.. తొలి టెస్ట్ మొదటి రోజు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే! పొన్నూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా బండ్లమూడి. గీత ఉపాధ్యక్షుడిగా ఉమా మహేశ్వరరావు ప్రమాణ స్వీకారం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి జవగళ్ శ్రీనాథ్ రికార్డు అధిగమించిన బుమ్రా.. టెస్ట్ వికెట్లలో టాప్ 10లోకి ప్రవేశం! భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన మానవత్వం చాటుకున్న పట్నం మహేందర్ రెడ్డి.. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి అండగా నిలిచిన చీఫ్ విప్ పుణ్య  క్షేత్రాలకు పత్యేక ఆర్టీసీ బస్సులు. జగన్ పాలనలో గ్రామాలు విధ్వంసం.. కూటమి పాలనలో అభివృద్ధి వికాసం : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ క్రీడల్లో గెలుపోటములు సహజం - ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి.

జగన్ పాలనలో గ్రామాలు విధ్వంసం.. కూటమి పాలనలో అభివృద్ధి వికాసం : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ

Select Suryaa Now
జగన్ పాలనలో గ్రామాలు విధ్వంసం.. కూటమి పాలనలో అభివృద్ధి వికాసం  : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

గత వైసీపీ ఐదేళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, పల్లె ప్రగతిపై ఆ పార్టీ గొడ్డలి వేటు వేసిందని తెలుగుదేశం పార్టీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ విమర్శించారు. గత ప్రభుత్వ నిర్వాకాలకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 9 వేల కోట్లను ఆ పార్టీ దారి మళ్లించి, గ్రామాలను నిర్వీర్యం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే 'పల్లె పండుగ' కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధి కోసం రూ. 32 వేల కోట్లు ఖర్చు చేసిందని ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ తెలిపారు. 
పల్లె ప్రగతిపై గత ప్రభుత్వం గొడ్డలి వేటు.. కూటమి పాలనలో గ్రామాలకు జవసత్వాలు
గత వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 9 వేల కోట్లను ఆ పార్టీ దారి మళ్లించింది. కానీ నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే 'పల్లె పండుగ 1, 2, 3' కార్యక్రమాల ద్వారా రూ. 31,685 కోట్లు (దాదాపు రూ. 32 వేల కోట్లు) ఖర్చు చేస్తోంది. దీని ద్వారా గ్రామాల్లో 12,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 19,100 కిలోమీటర్ల బీటీ రోడ్లను నిర్మించాం. గత వైసీపీ హయాంలో కేవలం 800 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే వేసి, అవి కూడా పెసరట్టు మీద ఉల్లిపాయ ముక్కల్లా పైపైన తారు వేసి చేతులు దులుపుకున్నారని ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ కింద రాష్ట్రానికి రూ. 26 వేల కోట్లు కేటాయిస్తే, గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిధులను మురగబెట్టింది. కేవలం రూ. 2,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ. 4,128 కోట్ల అవినీతికి పాల్పడింది. ఆడపడుచుల కష్టాలపై పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వాటా నిధులను విడుదల చేయడమే కాకుండా, కేంద్రంతో మాట్లాడి పథకం గడువును 2028 వరకు పొడిగించారు. దీని ద్వారా 95.44 లక్షల ఇంటింటి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా, గ్రామాల్లోని ప్రతి ఇంటికీ 365 రోజులు, 24 గంటలూ నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు రూ. 30 వేల కోట్లతో భారీ వాటర్ ట్యాంకుల నిర్మాణం, మంచినీటి వ్యవస్థ బలోపేతానికి విస్తృత ప్రణాళిక రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ మస్టర్లలో వైసీపీ కార్యకర్తల పేర్లు చేర్చి దాదాపు రూ. 1,300 కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారు. నేడు కూటమి ప్రభుత్వం వ్యవస్థను ప్రక్షాళన చేసి అవినీతికి అడ్డుకట్ట వేసింది. 'విబిజి రామ్ జీ' పథకం కింద కేంద్రం నుంచి 60 శాతం వాటాగా రూ. 2,226 కోట్లు రాగా, రాష్ట్ర వాటాగా రూ. 1,484 కోట్లు కలిపి పేదల కోసం ఖర్చు చేశాం. అంతేకాకుండా, ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడం ద్వారా ప్రతి పేద కుటుంబానికి అదనంగా 25 రోజుల ఉపాధి కల్పించాం. జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో సరైన రోడ్లు లేక ఆసుపత్రులకు వెళ్లే దారిలోనే గర్భిణులు ఆటోలు, బస్సుల్లో ప్రసవించే దుస్థితిని కళ్లారా చూశాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పనిచేసింది. 2014-19 మధ్య రాష్ట్ర విభజన జరిగి నిధుల కొరత ఉన్నప్పటికీ, అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంతో పట్టుదలతో ఉపాధి హామీ నిధులను అనుసంధానిస్తూ దేశంలోనే వినూత్న విధానాలను తీసుకొచ్చారు. ఆ ఐదేళ్లలో రూ. 6,200 కోట్లతో 27,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 22,000 కిలోమీటర్ల గ్రామీణ బీటీ రోడ్లు, 27 లక్షల ఎల్‌ఈడీ (LED) వీధి దీపాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఆడపడుచుల కాలికి మట్టి అంటకుండా చేశాం. నేడు చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి చొరవ, కూటమి ప్రభుత్వ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ గ్రామాలు మళ్లీ స్వర్ణయుగం దిశగా అడుగులు వేస్తున్నాయని, గత పాలకుల విధ్వంసానికి, నేటి నిర్మాణాత్మక పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలందరూ గమనించాలని ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ కోరారు. 
పల్లెల ప్రగతి, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. గత పాలనలో గుంతల రోడ్లు, చెత్త కుప్పలే మిగిలాయి
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధికి దూరమై గుంతల రోడ్లకు, చెత్త కుప్పలకు నిలయాలుగా మారాయని, నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పల్లెల రూపురేఖలు మారుస్తోందని తెలుగుదేశం పార్టీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పల్లెల్లో కనీస అభివృద్ధి చేయకుండా రోడ్లను గుంతలమయంగా వదిలేసింది. పైగా నెలకు రూ. 60 చొప్పున చెత్త పన్ను వసూలు చేసి, చెత్తను తొలగించకుండా రాష్ట్రవ్యాప్తంగా 81 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పోగేసి వదిలేసింది. నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ 81 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిగా తొలగించడమే కాకుండా, గ్రామాల్లో నిజమైన శుభ్రత ఎలా ఉంటుందో చేసి చూపించింది. కూటమిలోని అన్ని పార్టీలు కలిసికట్టుగా పల్లెలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. గత ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర విషయంలోనూ, మూడేళ్ల పాటు పంటల బీమా చెల్లింపుల్లోనూ రైతులకు ఎగనామం పెట్టింది. మద్దతు ధరల కోసం వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 880 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నేరుగా రైతుల ఖాతాల్లో రూ. 1,200 కోట్లు జమ చేసింది. గత పాలకులు ఫసల్ బీమా యోజనకు రాష్ట్ర వాటా చెల్లించకుండా కాలయాపన చేయడంతో పేరుకుపోయిన రూ. 2,000 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం దశలవారీగా చెల్లిస్తూ, పంటల బీమా పథకాన్ని తిరిగి పునరుద్ధరించింది. గత పాలకులు రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పక్కన పెట్టేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులతో పాటు జీవనాడి పోలవరం పనులను పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే పోలవరం ఎడమ కాలువ ద్వారా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం సాయంతో అనకాపల్లి, విశాఖపట్నం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీళ్లు అందించారు. అంతేకాకుండా, నిరుపయోగంగా పెండింగ్‌లో పడి ఉన్న మరో 36 సాగునీటి ప్రాజెక్టులను స్వయంగా పర్యవేక్షిస్తూ రూ. 35 వేల కోట్లతో పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో కొత్తగా 17 లక్షల ఎకరాలు సాగులోకి రావడమే కాకుండా, మరో 33 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఒకవైపు పల్లెల అభివృద్ధి, మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతాంగాన్ని ఆర్థికంగా నిలబెట్టాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన ఆశయమని ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ స్పష్టం చేశారు. 
పేదల ఇళ్ల స్థలాల్లో దోపిడీ, భూకబ్జాలకు చెక్
గత వైసీపీ పాలనలో సెంటు పట్టా పేరుతో ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారని ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ విమర్శించారు. ఊరికి ఆనుకుని కాకుండా 4 కిలోమీటర్ల దూరంలో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి, అధిక ధరలకు ప్రభుత్వానికి అంటగడుతూ కమీషన్ల రూపంలో రూ. 7 వేల కోట్ల అవినీతి చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 5.5 లక్షల ఇళ్లను పంపిణీ చేసిందని తెలిపారు. గత పాలకులు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని, సుమారు 4 లక్షల ఎకరాలకు పైగా భూకబ్జాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రెండో సంతకంతో ఆ నల్ల చట్టాన్ని రద్దు చేయడమే కాకుండా, భూకబ్జాదారులకు 10 నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష పడేలా 'ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్' తీసుకొచ్చారని చెప్పారు. అలాగే, సరిహద్దు రాళ్లు, పాసుపుస్తకాలపై గత ముఖ్యమంత్రి ఫోటోలను తొలగించి, ఎలాంటి వ్యక్తిగత ఫోటోలు లేకుండా 33 లక్షల కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు ఉచితంగా అందజేశామని పేర్కొన్నారు. గతంలో ధాన్యం అమ్ముకుంటే మూడు, నాలుగు నెలల వరకు రైతులకు డబ్బులు అందేవి కావని, నేడు 15 రోజుల నుంచి మూడు వారాల లోపే నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో పాటు, 'రామ్ జీ' (ఉపాధి హామీ) పథకంలో అవినీతికి అడ్డుకట్ట వేసి 125 రోజుల పని కల్పిస్తున్నామని చెప్పారు. 2014-19 మధ్య కాలంలో ఆడపడుచుల కాలికి మట్టి అంటకుండా రోడ్లు వేసిన చంద్రబాబు నాయుడు గారు, నేడు 'పల్లె పండుగ 1, 2, 3' కార్యక్రమాల ద్వారా గుంతల రోడ్ల స్థానంలో వేల కిలోమీటర్ల కొత్త రోడ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. మగవారు పొలాలకు వెళ్లాక నీళ్ల కోసం మహిళలు బయటకు వెళ్లే ఇబ్బంది లేకుండా, జలజీవన్ మిషన్ ద్వారా 90 లక్షలకు పైగా ఇంటింటి కుళాయి కనెక్షన్లతో 365 రోజులు తాగునీరు అందిస్తున్నామన్నారు. 1వ తేదీ ఉదయం 6 గంటలకే ఇంటి తలుపు తట్టి పింఛన్ అందిస్తున్న ప్రభుత్వమిదని కొనియాడారు. ఈ వయసులోనూ 35 ఏళ్ల యువకుడు కూడా పడలేనంత కష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు, పల్లెల అభివృద్ధి, సాగునీటి రంగాల కోసం పడుతున్నారని ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ప్రశంసించారు. 2014-19 నాటి అభివృద్ధి, వైసీపీ నాటి విధ్వంసం, నేటి కూటమి పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. మంచి చేసిన ప్రభుత్వానికి శాలువాలు, బహుమతులు అక్కర్లేదని, ప్రజలు వేసే ఒక్క ఓటే పెద్ద గౌరవమని చెప్పారు. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో కూటమికి వచ్చిన భారీ మెజారిటీ ప్రజల ఆశీస్సులకు నిదర్శనమని, ప్రజలంతా గడ్డిమోపులా కలిసికట్టుగా ఉండి 2029లోనూ కూటమి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.