BREAKING
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నూతన ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పెరుగు నాగలక్ష్మి రెడ్డి అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు తొలి టెస్ట్‌లో రవీంద్ర జడేజాకు ఎందుకు చోటు దక్కలేదు.. అసలు కారణం చెప్పిన టీమ్ మేనేజ్‌మెంట్! ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే కుట్రను తక్షణమే విరమించుకోవాలి.! శ్రీలంకతో రెండో టెస్ట్‌లో పాక్ పేసర్ సాకిబ్ ఖాన్‌కు గాయం.. బౌలింగ్‌కు దూరం! నికోల్స్ అజేయ శతకం, గ్లెన్ ఫిలిప్స్ మెరుపులు.. తొలి టెస్ట్ మొదటి రోజు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే! పొన్నూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా బండ్లమూడి. గీత ఉపాధ్యక్షుడిగా ఉమా మహేశ్వరరావు ప్రమాణ స్వీకారం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి జవగళ్ శ్రీనాథ్ రికార్డు అధిగమించిన బుమ్రా.. టెస్ట్ వికెట్లలో టాప్ 10లోకి ప్రవేశం! భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన

రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన

Select Suryaa Now
రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి -  ఓటు హక్కు వినియోగం పై అవగాహన

సూర్య డిచ్ పల్లి : తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయంలోని , సైన్స్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్–II ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ ఆన్లైన్ క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన మై భారత్, మై జిఓ వి సంయుక్తంగా నిర్వహిస్తున్న రాజ్యాంగ దినోత్సవ క్విజ్ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్బంగా భారత రాజ్యాంగ నిర్మాణ చరిత్ర, రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు తదితర అంశాలపై NSS వాలంటీర్లకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అహ్మద్ అబ్దుల్ హలీమ్ ఖాన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు తన బాధ్యతలను కూడా తెలుసుకోవాలని సూచించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.