BREAKING
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నూతన ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పెరుగు నాగలక్ష్మి రెడ్డి అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు తొలి టెస్ట్‌లో రవీంద్ర జడేజాకు ఎందుకు చోటు దక్కలేదు.. అసలు కారణం చెప్పిన టీమ్ మేనేజ్‌మెంట్! ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే కుట్రను తక్షణమే విరమించుకోవాలి.! శ్రీలంకతో రెండో టెస్ట్‌లో పాక్ పేసర్ సాకిబ్ ఖాన్‌కు గాయం.. బౌలింగ్‌కు దూరం! నికోల్స్ అజేయ శతకం, గ్లెన్ ఫిలిప్స్ మెరుపులు.. తొలి టెస్ట్ మొదటి రోజు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే! పొన్నూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా బండ్లమూడి. గీత ఉపాధ్యక్షుడిగా ఉమా మహేశ్వరరావు ప్రమాణ స్వీకారం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి జవగళ్ శ్రీనాథ్ రికార్డు అధిగమించిన బుమ్రా.. టెస్ట్ వికెట్లలో టాప్ 10లోకి ప్రవేశం! భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన

ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి

Select Suryaa Now
ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి
సూర్య-నవీపేట్ : భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలను గురువారం మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, జాతీయ సమైక్యత దినోత్సవాన్ని స్మరించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వివిధ రకాల అనారోగ్యాలతో చికిత్స పొందిన 8 మంది లబ్ధిదారులకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు 3 లక్షల 23 వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మోస్రా సాయరెడ్డి మాట్లాడుతూ. దేశ అభ్యున్నతికి, ఐక్యత, సమగ్రత పరిరక్షణకు విశేష కృషి చేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని ఆమె సేవలను కొనియాడారు. కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలకు అతీతంగా భారతీయులంతా ఒకటే అన్న ఐక్యమత్యంతో ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారని పేర్కొన్నారు. గరీబ్ హఠావో నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేసిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ అని అన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుందని తెలిపినారు. దేశం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ ఆశయాల సాధనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ నవీన్ రాజ్, మాజీ మండల అధ్యక్షులు రాజేందర్ కుమార్ గౌడ్, నేతికుంట భగవాన్, ఎస్.కె మూస, బుడ్డ సంజీవ్ రెడ్డి, భీమర్తి మోహన్, వసంత్ కుమార్, జబీర్, రవి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.