BREAKING
శ్రీలంకతో రెండో టెస్ట్‌లో పాక్ పేసర్ సాకిబ్ ఖాన్‌కు గాయం.. బౌలింగ్‌కు దూరం! నికోల్స్ అజేయ శతకం, గ్లెన్ ఫిలిప్స్ మెరుపులు.. తొలి టెస్ట్ మొదటి రోజు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే! పొన్నూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా బండ్లమూడి. గీత ఉపాధ్యక్షుడిగా ఉమా మహేశ్వరరావు ప్రమాణ స్వీకారం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి జవగళ్ శ్రీనాథ్ రికార్డు అధిగమించిన బుమ్రా.. టెస్ట్ వికెట్లలో టాప్ 10లోకి ప్రవేశం! భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన మానవత్వం చాటుకున్న పట్నం మహేందర్ రెడ్డి.. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి అండగా నిలిచిన చీఫ్ విప్ పుణ్య  క్షేత్రాలకు పత్యేక ఆర్టీసీ బస్సులు. జగన్ పాలనలో గ్రామాలు విధ్వంసం.. కూటమి పాలనలో అభివృద్ధి వికాసం : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ క్రీడల్లో గెలుపోటములు సహజం - ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి.

మానవత్వం చాటుకున్న పట్నం మహేందర్ రెడ్డి.. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి అండగా నిలిచిన చీఫ్ విప్

Select Suryaa Now
మానవత్వం చాటుకున్న పట్నం మహేందర్ రెడ్డి.. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి అండగా నిలిచిన చీఫ్ విప్

హైదరాబాద్/మల్కాజిగిరి, నవంబర్ 19:** శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గురువారం మల్కాజిగిరిలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్తుండగా, మౌలాలి పరిసర ప్రాంతమైన ఆనంద్‌బాగ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై అచేతనంగా పడి ఉన్న ఒక వ్యక్తిని చూసి ఆయన చలించిపోయారు. వెంటనే తన కాన్వాయ్‌ను నిలిపివేసి బాధితుడి వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.

వరంగల్ జిల్లాకు చెందిన సురేష్ అనే కూరగాయల వ్యాపారి మార్కెట్‌కు వెళ్తుండగా గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన మహేందర్ రెడ్డి.. స్థానిక ట్రాఫిక్ పోలీసులు, తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహాయంతో బాధితుడిని పోలీసు వాహనంలో ఎక్కించి హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సహాయక చర్యల్లో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ కూడా ఆయనకు తోడుగా నిలిచారు.

అనంతరం గాంధీ ఆసుపత్రి ఉన్నతాధికారులకు స్వయంగా ఫోన్ చేసిన మహేందర్ రెడ్డి.. బాధితుడు సురేష్ ఆరోగ్య పరిస్థితిని వివరించి, అతనికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సమయానికి స్పందించి తన ప్రాణాలు కాపాడేందుకు కృషి చేసిన మహేందర్ రెడ్డికి బాధితుడు సురేష్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను విధిగా పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని మహేందర్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకున్న ఆయన సేవాభావాన్ని స్థానికులు అభినందించారు.