BREAKING
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నూతన ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పెరుగు నాగలక్ష్మి రెడ్డి అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు తొలి టెస్ట్‌లో రవీంద్ర జడేజాకు ఎందుకు చోటు దక్కలేదు.. అసలు కారణం చెప్పిన టీమ్ మేనేజ్‌మెంట్! ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే కుట్రను తక్షణమే విరమించుకోవాలి.! శ్రీలంకతో రెండో టెస్ట్‌లో పాక్ పేసర్ సాకిబ్ ఖాన్‌కు గాయం.. బౌలింగ్‌కు దూరం! నికోల్స్ అజేయ శతకం, గ్లెన్ ఫిలిప్స్ మెరుపులు.. తొలి టెస్ట్ మొదటి రోజు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే! పొన్నూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా బండ్లమూడి. గీత ఉపాధ్యక్షుడిగా ఉమా మహేశ్వరరావు ప్రమాణ స్వీకారం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి జవగళ్ శ్రీనాథ్ రికార్డు అధిగమించిన బుమ్రా.. టెస్ట్ వికెట్లలో టాప్ 10లోకి ప్రవేశం! భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన

అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా

Select Suryaa Now
అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా

కొండాపూర్ ; మండల పరిధిలోని మునిదేవునిపల్లి గ్రామం సర్వే నంబర్ 92లో ఉన్న 293 ఎకరాల 14 గుంటల అసైన్డ్ భూముల భూసేకరణ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. భూసేకరణలో రైతులకు అన్యాయం జరుగుతోందని, మధ్యవర్తులే లబ్ధి పొందుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ ఉపసర్పంచ్ పడమటి వరలక్ష్మి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు హైదరాబాద్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును కలిసి తమ సమస్యలను వివరించారు. రైతులకు న్యాయం జరిగేలా పోరాడతామని హరీశ్‌రావు హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.

రూ.4 కోట్ల భూమికి రూ.22.75 లక్షల పరిహారమా?

ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా భూసేకరణ చేపట్టి గ్రామసభ నిర్వహించిందని, ఎకరాకు రూ.22.75 లక్షల చొప్పున పరిహారం నిర్ణయించిందని రైతులు హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరా భూమి రూ.4 కోట్లకు పైగా ధర పలుకుతుండగా, తమకు కేవలం రూ.22.75 లక్షలే చెల్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటివరకు సుమారు 75 శాతం మంది రైతుల ఖాతాల్లోనే పరిహారం జమైందని, మిగిలిన రైతులకు ఇంకా డబ్బులు అందలేదని వివరించారు. తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న భూములను సేకరిస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇళ్ల స్థలాలు, ఉపాధికి హామీ ఇవ్వాలి

భూసేకరణ అనంతరం పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని చెబుతున్నప్పటికీ, ఏయే పరిశ్రమలు వస్తాయి, రైతులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తారనే విషయాలను స్పష్టంగా వెల్లడించడం లేదని తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు, ఉపాధి అవకాశాలు కల్పించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని కోరారు.

రైతులకు అండగా ఉంటా: హరీశ్‌రావు

రైతుల సమస్యలను విన్న హరీశ్‌రావు బలవంతపు భూసేకరణ చేయకూడదని, భూములు కోల్పోతున్న రైతులకు న్యాయబద్ధమైన పరిహారం చెల్లించాలని సూచించినట్లు రైతులు తెలిపారు. రైతులకు జీవనోపాధి, ఇళ్ల స్థలాలు కల్పించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని, ఏర్పాటు చేయనున్న పరిశ్రమలు, స్థానికులకు కల్పించే ఉపాధి అవకాశాలపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నట్లు వెల్లడించారు. రైతులకు తెలియకుండా సర్వేలు నిర్వహించడం సరికాదని, అసైన్డ్ భూముల భూసేకరణలో మధ్యవర్తుల ప్రమేయం, రైతులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడాల్సిన అవసరం ఉందని వివరించినట్లు రైతులు తెలిపారు. మునిదేవునిపల్లి రైతులకు న్యాయం జరిగేలా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అవసరమైతే అసైన్డ్ భూముల వ్యవహారంపై న్యాయపోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని రైతులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పడమటి వరలక్ష్మి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ యువ నాయకులు ఫయాజ్, శ్రీకాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి, మల్కా గౌడ్, ఆంజనేయులు గౌడ్, బుచ్చయ్య, శంకరయ్య, మందుల రాములు, ఎర్రోళ్ల బందయ్య, కుమ్మరి నర్సింలు, వెంకటయ్య, నర్సింలు, రామయ్య, శివయ్య, ఎల్లకొండ విష్ణు తదితరులు పాల్గొన్నారు