BREAKING
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నూతన ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పెరుగు నాగలక్ష్మి రెడ్డి అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు తొలి టెస్ట్‌లో రవీంద్ర జడేజాకు ఎందుకు చోటు దక్కలేదు.. అసలు కారణం చెప్పిన టీమ్ మేనేజ్‌మెంట్! ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే కుట్రను తక్షణమే విరమించుకోవాలి.! శ్రీలంకతో రెండో టెస్ట్‌లో పాక్ పేసర్ సాకిబ్ ఖాన్‌కు గాయం.. బౌలింగ్‌కు దూరం! నికోల్స్ అజేయ శతకం, గ్లెన్ ఫిలిప్స్ మెరుపులు.. తొలి టెస్ట్ మొదటి రోజు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే! పొన్నూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా బండ్లమూడి. గీత ఉపాధ్యక్షుడిగా ఉమా మహేశ్వరరావు ప్రమాణ స్వీకారం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి జవగళ్ శ్రీనాథ్ రికార్డు అధిగమించిన బుమ్రా.. టెస్ట్ వికెట్లలో టాప్ 10లోకి ప్రవేశం! భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన

ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు

Select Suryaa Now
 ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు

తిరుపతి, మేజర్‌న్యూస్‌ :

తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన భాగ్యశ్రీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను ఆటోలో తీసుకెళ్లి బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 31న తిరుపతి రూరల్ పరిధిలోని సి.మల్లవరం సమీపంలోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో పోలీసులకు మృతురాలి వివరాలు తెలుసుకోవడం సవాలుగా మారింది. చివరకు దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా ఆమె చిత్తూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన భాగ్యశ్రీగా గుర్తించారు.

కాల్ డేటాతో చిక్కిన నిందితుడు!

సీసీ కెమెరాలు, ఏఎన్‌పీఆర్ ఫుటేజీలు, కాల్ డేటా, మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు షేక్ జమాలుల్లా బాషా అలియాస్ జమీల్ బాషా (38) ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ నెల 16న రొంపిచెర్ల క్రాస్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో భాగ్యశ్రీ తన సహోద్యోగులతో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. తన ఆటోలో ఆమెను సి.మల్లవరం సమీపంలోని వెంచర్‌కు తీసుకెళ్లి గొడవ అనంతరం బండరాయితో హత్య చేసినట్లు తెలిపారు.

నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన ఆటో, రెండు సెల్‌ఫోన్లు, రూ.450 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

17 రోజుల్లోనే మిస్టరీ ఛేదన!

ఎలాంటి ఆధారాలు లేని ఈ హత్య కేసును సాంకేతిక ఆధారాలతో 17 రోజుల్లో ఛేదించిన తిరుపతి రూరల్ పోలీసులను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు అభినందించారు.