BREAKING
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి జవగళ్ శ్రీనాథ్ రికార్డు అధిగమించిన బుమ్రా.. టెస్ట్ వికెట్లలో టాప్ 10లోకి ప్రవేశం! భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన మానవత్వం చాటుకున్న పట్నం మహేందర్ రెడ్డి.. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి అండగా నిలిచిన చీఫ్ విప్ పుణ్య  క్షేత్రాలకు పత్యేక ఆర్టీసీ బస్సులు. జగన్ పాలనలో గ్రామాలు విధ్వంసం.. కూటమి పాలనలో అభివృద్ధి వికాసం : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ క్రీడల్లో గెలుపోటములు సహజం - ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండగా నిలవాలి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ విషప్రచారం – విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం : ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారు : ఇంకొల్లు మండల పార్టీ అధ్యక్షులు నాయుడు హనుమంతరావు

Select Suryaa Now
కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారు : ఇంకొల్లు మండల పార్టీ అధ్యక్షులు నాయుడు హనుమంతరావు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారని ఇంకొల్లు మడల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాయుడు హనుమంతరావు కొనియాడారు. ఇంకొల్లు మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో జరిగిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇంకొల్లు మండలంలో 14 ఎం.పి.టి.సి స్థానాలు ఉంటే 10 కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుందన్నారు. మండల పరిత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పర్చూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుంజి వెంకట్రావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యులంతా ఐదు సంవత్సరాల పాటు సేవలందించి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం మండల తెలుగుదేశం పార్టీ పక్షాన ఎం.పి.పి దంపతులు కోట శ్రీదేవి, కోట వెంకట కృష్ణయ్య దంపతులను, జడ్పీటీసీ సభ్యుడు పూజల శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షులు నన్నా వెంకట్రావులతో పాటు కరి అవంతి (గంగవరం), అంబటి రాజ్యలక్ష్మి (ఇడుపులపాడు-2), బిందు మాధవి (ఇంకొల్లు-2), షేక్‌ మస్తాన్‌ బాబా (ఇంకొల్లు-1), పంది నాగరాజు (భీమవరం), మేడికొండ ఉషారాణి (దుద్దుకూరు), పెళ్ళూరి శివరామకృష్ణ (కొణికి)లను  సత్కరించారు.  కార్యక్రమంలో ఇంకొల్లు సొసైటి అధ్యక్షులు కరి శ్రీనివాసరావు, ఇంకొల్లు పట్టణ పార్టీ అధ్యక్షులు వలేరు మార్కుతదితరులు పాల్గొన్నారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.