ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన
*--లబ్ధిదారులకు ఇంకుడు గుంతల నిర్మాణంపై సూచనలు*
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని లింగంపల్లి గ్రామంలో గురువారం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను గృహ నిర్మాణ శాఖ అధికారులు పరిశీలించారు.డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (గృహ నిర్మాణ శాఖ)విజయ్ కుమార్,ఎంపీడీవో జయరాం నాయక్, అసిస్టెంట్ ఇంజనీర్ నరసింహారెడ్డి,శిక్షణ అసిస్టెంట్ ఇంజనీర్ రాహుల్ కలిసి ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..ఇళ్ల నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని,వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదగిరి,పంచాయతీ కార్యదర్శి శ్వేత,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.