BREAKING
అమాట్–2026 పోస్టర్ ఆవిష్కరణ విడుదలకు నెల ముందే రూ.28 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్.. రామాయణ, ధురంధర్ 2 రికార్డులను దాటిన అవెంజర్స్ డూమ్స్‌డే! టీఎస్ యుటిఎఫ్ ఎంజెపి కరీంనగర్ వింగ్ ఎన్నిక *ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన 2వ వార్డు కౌన్సిలర్ బాణావత్ వెంకటరమణ నాయక్* యువతలో క్రీడలపట్ల ఆసక్తిని పెంపొందించాలి - కలెక్టర్ రాజర్షి షా పరవాడ ఎంపీపీగా కన్నూరు వెంకటరమణ, వైస్ ఎంపీపీగా బుగిడి రామ గోవిందరావు లు ఏకగ్రీవంగా ఎన్నిక సీన్ సక్సెస్.. నస్లేన్‌కు సూర్య కాస్ట్లీ కార్టియర్ వాచ్ బహుమతి.. బాక్సాఫీస్ జోరు ఇలా! కొత్తచెరువు ఎంపీపీగా మహాలక్ష్మి ఎన్నిక.. తొట్టంబేడు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఆ దర్శకుడిని నేనే స్వయంగా సినిమా అడిగాను.. వెంకీ కుడుములపై చిరంజీవి సరదా వ్యాఖ్యలు! ఇంకొల్లు మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా కోట శ్రీదేవి, ఉపాధ్యక్షులుగా నున్నా వెంకట్రావు బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో విద్యాబాలన్.. ఎన్బీకే112పై ఆసక్తికర ప్రచారం! భారత ఉక్కు మహిళ ఇందిరాగాంధీః మంత్రి వాకిటి ఈనెల 25న మెగా జాబ్ మేళా ముదిగుబ్బ ఎంపీపీ ఎన్నిక వాయిదా

ఇంకొల్లు మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా కోట శ్రీదేవి, ఉపాధ్యక్షులుగా నున్నా వెంకట్రావు

Select Suryaa Now
ఇంకొల్లు మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా కోట శ్రీదేవి, ఉపాధ్యక్షులుగా నున్నా వెంకట్రావు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా నాగండ్ల ఎం.పి.టి.సి కోట శ్రీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా జనసేన పూసపాడు అభ్యర్థి నున్నా వెంకట్రావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల స్పెషల్‌ ఆఫీసర్‌ కె. రమేష్‌బాబు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మండల అభివృద్ధి అధికారి గట్టా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మండల పరిషత్‌ కార్యాలయం పక్షాన సత్కరించారు. ప్రమాణం చేసిన వారిలో ఎం.పి.పి.గా కోట శ్రీదేవి (నాగండ్ల), వైస్‌ ఎం.పి.పిగా నున్నా వెంకట్రావు (పూసపాడు), కరి అవంతి (గంగవరం), అంబటి రాజ్యలక్ష్మి (ఇడుపులపాడు-2), బిందు మాధవి (ఇంకొల్లు-2), షేక్‌ మస్తాన్‌ బాబా (ఇంకొల్లు-1), పంది నాగరాజు (భీమవరం), మేడికొండ ఉషారాణి (దుద్దుకూరు), పెళ్ళూరి శివరామకృష్ణ (కొణికి), వైసీపీ సభ్యులు బండారు అజిత్‌ బాబు (ఇడుపులపాడు-1), నీలం శ్రీనివాసరావు (ఇంకొల్లు-4), యర్రం కల్పన (వంకాయలపాడు), పావులూరి సముద్రవేణి (పావులూరు) ఉన్నారు. ఎం.పి.పి ఎన్నిక సమయంలో వైసీపీ సభ్యులు సభ్యకు హాజరు కాకుండా వెళ్ళి పోయారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.