*ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన 2వ వార్డు కౌన్సిలర్ బాణావత్ వెంకటరమణ నాయక్*
మధిర…సూర్య
వితంతు, వికలాంగుల పెన్షన్ పథకంలో భాగంగా నూతనంగా మంజూరైన పెన్షన్ పత్రాలను 2వ వార్డు కౌన్సిలర్ బాణావత్ వెంకటరమణ నాయక్ 40 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు వారి జీవనానికి ఆర్థిక భరోసాగా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ షన్ను షేక్ గౌసుద్దీన్సజ్జ ప్రసాద్ కొంగర రవి రెండవ వార్డు మహిళా కాంగ్రెస్ నాయకురాలు సామినేని లక్ష్మి పటాన్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.