telangana
ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : భారతదేశపు తొలి మహిళా ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, జిల్లా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఇందిరా గాంధీ చేసిన చిరస్మరణీయ సేవలను నేతలు కొనియాడుతూ, నినాదాలు చేస్తూ వారిని స్మరించుకున్నారు. అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డును సందర్శించి రోగులకు, చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపుల నర్సయ్య, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్ రావు, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు ఖిజర్ పాషా, కౌన్సిలర్ అన్నపూర్ణ, మావల మండల అధ్యక్షుడు సురేష్, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు బెజ్జంకి అనిల్, మాజీ కౌన్సిలర్ గౌళి సంజయ్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.