మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
పాలకీడు మేజర్ న్యూస్
పాలకీడు మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మాజీ ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్ అధ్వర్యంలో కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె దేశానికి చేసిన సేవలను, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను, దేశ అభివృద్ధికి చేసిన కృషిని స్మరించుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు.ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవలో ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాలకీడు మండల పార్టీ మాజీ ఎంపీపీ భూక్య గోపాల్, మండల నాయకులు సప్పిడి నాగిరెడ్డి బాల్ రెడ్డి బుర్రి వెంకయ్య మీసాల జార్జి మట్టపల్లి గురువయ్య తదితరులు పాల్గొన్నారు