BREAKING
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి జవగళ్ శ్రీనాథ్ రికార్డు అధిగమించిన బుమ్రా.. టెస్ట్ వికెట్లలో టాప్ 10లోకి ప్రవేశం! భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన మానవత్వం చాటుకున్న పట్నం మహేందర్ రెడ్డి.. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి అండగా నిలిచిన చీఫ్ విప్ పుణ్య  క్షేత్రాలకు పత్యేక ఆర్టీసీ బస్సులు. జగన్ పాలనలో గ్రామాలు విధ్వంసం.. కూటమి పాలనలో అభివృద్ధి వికాసం : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ క్రీడల్లో గెలుపోటములు సహజం - ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండగా నిలవాలి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ విషప్రచారం – విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం : ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

రైతులకు అండగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు – కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్

Select Suryaa Now
రైతులకు అండగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు – కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్
సూర్య కరీంనగర్ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సజావుగా విక్రయించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ తెలిపారు.ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం విక్రయించే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పురుమల్ల  శ్రీనివాస్, రామ్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు మీసాల శంకర్, మలోతుమాలతి, మార్కెట్ కమిటీ  సెక్రటరీ హమీద్ అలీ, ప్యాక్స్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, అగ్రికల్చర్ ఏడి రంజిత్ రెడ్డి, సీఈఓ రమేష్  సంబంధిత అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.