telangana
ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
సూర్య కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని 4వ డివిజన్ లో భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు గాదె శివరాం మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని, పేద ప్రజల సంక్షేమం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఆమె ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మురళి, హరీష్, అడిగొప్పుల శ్రీనివాస్, క్రాంతి, లచ్చాయ, నరేష్, పాలుగోన్నారు.