BREAKING
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి జవగళ్ శ్రీనాథ్ రికార్డు అధిగమించిన బుమ్రా.. టెస్ట్ వికెట్లలో టాప్ 10లోకి ప్రవేశం! భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన మానవత్వం చాటుకున్న పట్నం మహేందర్ రెడ్డి.. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి అండగా నిలిచిన చీఫ్ విప్ పుణ్య  క్షేత్రాలకు పత్యేక ఆర్టీసీ బస్సులు. జగన్ పాలనలో గ్రామాలు విధ్వంసం.. కూటమి పాలనలో అభివృద్ధి వికాసం : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ క్రీడల్లో గెలుపోటములు సహజం - ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండగా నిలవాలి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ విషప్రచారం – విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం : ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే 

Select Suryaa Now
అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే 

 సూర్య చొప్పదండి : చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలోని 12 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం  ప్రారంభించారు. అనంతరం సత్యం మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు.చిన్నారులకు ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్యను (ప్రీ-స్కూల్) అందించడంలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.ఈ నూతన భవనం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా భారతదేశ మొదటి మహిళ ప్రధాని, ఉక్కు మహిళ, భారతరత్న స్వర్గీయ  శ్రీమతి ఇందిరా గాంధీ  109 వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఫాక్స్ చైర్మన్  ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ పెరుమండ్ల మానస గంగయ్య గౌడ్, భూపాలపట్నం సర్పంచ్ మడిపెల్లి సంజీవ్, ఆర్నకొండ సింగిల్ విండో చైర్మన్ ఎన్నం మనోహర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిల్ విండో వైస్ చైర్మన్ నిజనపురం చందు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పురం రాజేశం మాజీ ఎంపీపీ మునిగాల విజయలక్ష్మి చందు, మాజీ సర్పంచ్ మునిగాల సుధాకర్ గౌడ్, ఉప సర్పంచ్ మునిగాల నరేష్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్స్, ఉప సర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్లు,మాజీ మార్కేట్ కమిటీ డైరెక్టర్లు,  ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు,  అంగన్వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.