అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థినిలకు కలుషిత ఆహారం
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : కలుషిత ఆహారంతోనే విద్యార్థులు అస్వస్థకు మూల కారణమైన ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ ఎస్టీ సంఘాల జేసి రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. గురువారం రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గుమ్మగట్ట కేజీబీవీ కళాశాలలో కలుషిత ఆహారంతో అస్వస్థత గురై చికిత్స పొందుతున్న విద్యార్థినులను సాకే హరి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాలుషిత ఆహారానికి మూల కారణం ప్రిన్సిపాల్, నిత్యవసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లను వెంటనే తొలగించాలన్నారు. కుళ్లిపోయి బూజు పట్టిన ఎర్రగడ్డలు,టమోటా,బీరకాయలతో కూరలు ఎలా చేస్తారని వీరి ఇళ్లల్లో కూడా ఇదే రకంగా ఉండక తింటారని మండిపడ్డారు.
278 మంది విద్యార్థినులు చదువుకుంటున్న కళాశాలలో తాగడానికి మంచి నీళ్లు లేవని ఉడకని అన్నము పచ్చి రసం, నీళ్ల మజ్జిగ వడ్డిస్తూ విద్యార్థినుల పొట్ట కొడుతున్నారని ఆవేదన చెందారు. కాంట్రాక్టర్లు లక్షల రూపాయలు బిల్లులు చేసుకుంటూ నాణ్యతలేని కారం,ధనియాల, రసం,సాంబారు పొడులు అందజేయడం ఘోరమన్నారు. జిల్లావ్యాప్తంగా కేజీబీవీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అనేక సందర్భాలలో ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం కనిపించలేదన్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు కేజీబీవీ గురుకుల పాఠశాల సందర్శించి విద్యార్థినీ విద్యార్థుల సంక్షేమ పట్ల శ్రద్ధ కనబరచాలని కోరారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసు, బహుజన సమాజ్ పార్టీ ఉలిగప్ప, ఎస్సీ ఎస్టీ జేఏసీ తాలూకా ఇన్చార్జ్ చెలిమప్ప, సీనియర్ నాయకులు మద్దానప్ప,జేఏసీ యువజన నాయకులు మహేష్,శ్రీకాంత్,గణేష్,ఈరన్న తదితరులు పాల్గొన్నారు.