స్థానిక సంస్థల విజయం కార్యకర్తల కే అంకితం. ఎమ్మెల్యే భూమాఅఖిలప్రియ
ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్;ఆళ్లగడ్డ నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ విజయం కార్యకర్తలకు అంకితమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల పేర్కొన్నారు. ఆళ్లగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సాయంత్రం నూతన ఎంపీపీ శీలంగీత వాణి, నూతన ఎంపీటీ సభ్యులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గం లో 71 ఎంపీటీసీ స్థానాలకు గాను 46 ఎంపిటిసిలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందన్నారు. ఆరు మండలాల్లోని ఆరు జడ్పిటిసిలు, ఆరు ఎంపీపీలు, ఆరు వైస్ ఎంపీపీ లను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని తెలిపారు. మండల కో ఆప్షన్ నెంబర్లను సైతం కూటమి కైవసం చేసుకుందన్నారు. ఈ విజయం కార్యకర్తలకు అంకితం చేస్తున్నామని మరోసారి పునరుద్ఘాటించారు. ఆళ్లగడ్డలో కూటమి బలం చూసి రెండు రాష్ట్రాల్లో ఆశ్చర్యపోతున్నారన్నారు. ఆళ్లగడ్డ అంటే బాంబుల గడ్డ కాదని అభివృద్ధి అడ్డా అని ఆమె అన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పోలీసులను అడ్డం పెట్టుకొని వారు ఎన్నికల్లో విజయం సాధించారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఉన్నప్పటికీ పోలీసులు అవసరం లేకుండ తాము ఎన్నికలుచేశామన్నారు. ప్రజల్లో తమకు బలం ఉంది కాబట్టే ఏకగ్రీవాలయ్యాయన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో తాము చూపిస్తున్నామని తమను నమ్మి తెలుగుదేశం పార్టీకి వచ్చిన వారికి మంచి గుర్తింపు ఇస్తున్నామన్నారు. ప్రజల మంచి కోసమే తాము ఏకగ్రీవాలను చేశామన్నారు. ప్రతి కుటుంబానికి రెండు లక్షల లబ్ధి చేకూరేలా అవకాశం కల్పిస్తామన్నారు. నంద్యాల జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి సంబంధించి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆమె స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేవారికి ప్రజలకు ఉపయోగపడే వారికి అవకాశం ఇవ్వాలని భూమా అఖిల ప్రియ అభిప్రాయపడ్డారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా