BREAKING
పలమనేరు దొర చెరువు వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు మూడు కార్లు ధ్వంసం.. రెండు కంటైనర్ లారీలు బోల్తా ప్రైవేట్ బస్సు ఢీకొని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు శింగనమల MPDO కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత MPTC స్థానాల సర్దుబాటుపై టీడీపీలో అసంతృప్తి.. పోలీసుల లాఠీఛార్జ్ ఐటిడిఏపిఓ, డిఈఓ లను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. తెలంగాణ నీటి వాటా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదుః టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలు మహాగాం పాఠశాలలో స్త్రీ శక్తి దివాస్ ఇందిరమ్మ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి •ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించడమే లక్ష్యం: డాక్టర్ నీలకంఠశ్వర్ రావు పలు గ్రామాల్లో పింఛను మంజూరు పత్రాల పంపిణీ స్థానిక సంస్థల విజయం కార్యకర్తల కే అంకితం. ఎమ్మెల్యే భూమాఅఖిలప్రియ తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. వెల్దుర్తి ఎంపీపీగా తోళ్ల మద్దిలేటి ప్రమాణం ఎంపీటీసీలతో ప్రమాణం చేయించిన ఆర్వో శ్రీదేవి ఘనంగా సన్మానించిన నేతలు.. అధికారుల అభినందనలు తిర్యాణిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఎంపీపీగా సబ్బవరపు సత్య వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన - ఎస్ఐ కొమురయ్య

చిత్తూరు రూరల్ మండల పీఠంపై ఎంపీపీ ,జయచంద్ర నాయుడు, వైస్ ఎంపీపీగా, లావణ్య.

Select Suryaa Now
చిత్తూరు రూరల్ మండల పీఠంపై ఎంపీపీ ,జయచంద్ర నాయుడు, వైస్ ఎంపీపీగా, లావణ్య.

చిత్తూరు అర్బన్ , మేజర్ న్యూస్:

చిత్తూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ), జయచంద్ర నాయుడు, ఉపాధ్యక్షురాలిగా( వైస్ ఎంపీపీ,) లావణ్య ఎన్నికై మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.చిత్తూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎన్నికల అధికారి వాణి ఆధ్వర్యంలో నిర్వహించిన పరోక్ష ఎన్నికల ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది.మండల పరిషత్ సభ్యుల మద్దతుతో అధ్యక్షుడిగా జయచంద్ర నాయుడు, ఉపాధ్యక్షురాలిగా లావణ్య ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికల అధికారి సమక్షంలో వారిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ తమపై నమ్మకంతో మద్దతు తెలిపి పదవులు చేపట్టేందుకు సహకరించిన మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.మండలంలోని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి ప్రజా అవసరాలపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. అందరి సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్,  లవకుమార్