telangana
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన - ఎస్ఐ కొమురయ్య
సూర్య జైనూర్ : సిర్పూర్ (యు) సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిర్పూర్ (యు) ఎస్ఐ కొమురయ్య సూచించారు. గురువారం సిర్పూర్ (యు) మండలంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులు, నకిలీ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరితోనూ ఓటీపీ, బ్యాంకు వివరాలు పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.