BREAKING
వత్సవాయి మండల ఎంపీపీగా పెరుమాళ్లపల్లి సునీత ఏకగ్రీవ ఎన్నిక వైస్ ఎంపీపీగా పెంటేల స్వప్న ఎన్నిక.. నూతన ఎంపీపీకి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఘన సత్కారం అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థినిలకు కలుషిత ఆహారం మాతృ, శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి – డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్ఐ పలమనేరు దొర చెరువు వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు మూడు కార్లు ధ్వంసం.. రెండు కంటైనర్ లారీలు బోల్తా ప్రైవేట్ బస్సు ఢీకొని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు శింగనమల MPDO కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత MPTC స్థానాల సర్దుబాటుపై టీడీపీలో అసంతృప్తి.. పోలీసుల లాఠీఛార్జ్ ఐటిడిఏపిఓ, డిఈఓ లను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. తెలంగాణ నీటి వాటా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదుః టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలు మహాగాం పాఠశాలలో స్త్రీ శక్తి దివాస్ ఇందిరమ్మ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి •ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించడమే లక్ష్యం: డాక్టర్ నీలకంఠశ్వర్ రావు పలు గ్రామాల్లో పింఛను మంజూరు పత్రాల పంపిణీ స్థానిక సంస్థల విజయం కార్యకర్తల కే అంకితం. ఎమ్మెల్యే భూమాఅఖిలప్రియ తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

Select Suryaa Now
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల (IPE 2027) తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) గురువారం విడుదల చేసింది. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు వేర్వేరు తేదీల్లో ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20, 2027 వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 24న ఫస్టియర్, ఫిబ్రవరి 25న సెకండియర్ పరీక్షలు ప్రారంభమవుతాయి.

ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ వివరాలు:థియరీ పరీక్షలకు ముందుగానే ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది. జనవరి 20 నుంచి 25 వరకు ఫస్టియర్ ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు మూడు సెషన్లలో సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలు (జనరల్, ఒకేషనల్ కోర్సులకు) జరగనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సబ్జెక్టుల వారీ టైమ్‌టేబుల్‌ను విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ (tgbie.cgg.gov.in) ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.