ఇందిరమ్మ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి •ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించడమే లక్ష్యం: డాక్టర్ నీలకంఠశ్వర్ రావు
సూర్య మంచిర్యాల: మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి వేడుకలను మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జిల్లా కేంద్రంలోని చార్వకాహాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలకంఠశ్వర్ రావు మాట్లాడుతూ..ఇందిరాగాంధీ దేశం గర్వించదగ్గ గొప్ప నాయకురాలని కొనియాడారు.ఆమె స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా కల్పించే లక్ష్యంతో ముందుకు సాగడం అభినందనీయమన్నారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని,ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలుస్తుండటాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక విమర్శలు,ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.ప్రజల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ సభ్యులు,జిల్లా మహిళా అధ్యక్షురాలు వనజ,నాయకులు ఓదేలు,పలిగిరి కనకరాజు,లింగమూర్తి, పెంటు,సాయిగౌడ్,అరుణ తదితరులు పాల్గొన్నారు.