శింగనమల MPDO కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత MPTC స్థానాల సర్దుబాటుపై టీడీపీలో అసంతృప్తి.. పోలీసుల లాఠీఛార్జ్
శింగనమల మండలంలో ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఉద్రిక్తతకు దారితీశాయి. మండలంలో వైసీపీ, టీడీపీకి సమానంగా ఎంపీటీసీ స్థానాలు రావడంతో ఎంపీపీ పదవిపై ఇరు పార్టీల మధ్య పోటీ నెలకొంది.ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీటీసీ సభ్యుల మధ్య సీట్ల సర్దుబాటు అంశంపై అంతర్గత విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే బండారు శ్రావణి నిర్ణయాలపై కొందరు టీడీపీ కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమె నివాసం వద్ద ఆందోళనకు దిగినట్లు సమాచారం.అనంతరం శింగనమల MPDO కార్యాలయం వద్ద కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో చేరడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు శింగనమల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. స్థానాల సర్దుబాటు వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.