BREAKING
వత్సవాయి మండల ఎంపీపీగా పెరుమాళ్లపల్లి సునీత ఏకగ్రీవ ఎన్నిక వైస్ ఎంపీపీగా పెంటేల స్వప్న ఎన్నిక.. నూతన ఎంపీపీకి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఘన సత్కారం అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థినిలకు కలుషిత ఆహారం మాతృ, శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి – డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్ఐ పలమనేరు దొర చెరువు వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు మూడు కార్లు ధ్వంసం.. రెండు కంటైనర్ లారీలు బోల్తా ప్రైవేట్ బస్సు ఢీకొని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు శింగనమల MPDO కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత MPTC స్థానాల సర్దుబాటుపై టీడీపీలో అసంతృప్తి.. పోలీసుల లాఠీఛార్జ్ ఐటిడిఏపిఓ, డిఈఓ లను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. తెలంగాణ నీటి వాటా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదుః టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలు మహాగాం పాఠశాలలో స్త్రీ శక్తి దివాస్ ఇందిరమ్మ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి •ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించడమే లక్ష్యం: డాక్టర్ నీలకంఠశ్వర్ రావు పలు గ్రామాల్లో పింఛను మంజూరు పత్రాల పంపిణీ స్థానిక సంస్థల విజయం కార్యకర్తల కే అంకితం. ఎమ్మెల్యే భూమాఅఖిలప్రియ తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

తిర్యాణిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

Select Suryaa Now
తిర్యాణిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
సూర్య తిర్యాణి : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 109వ జయంతిని గురువారం తిర్యాణి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ డైరెక్టర్, జవహర్ బాల్ మంచ్ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చైర్మన్ నైతం రాంచందర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొబ్బరికాయ కొట్టి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొట్నాక గణపతి మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరాగాంధీ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. పేదరిక నిర్మూలనకు చేపట్టిన చర్యలు, బ్యాంకుల జాతీయీకరణ వంటి నిర్ణయాలు సామాన్య ప్రజల జీవితాల్లో మార్పునకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఆమె ధైర్యం, నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.నైతం రాంచందర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను మరువలేమన్నారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బుద్దె విజయ్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు పులి కొమురయ్య, మాజీ మండల అధ్యక్షుడు అంకం గౌరయ్య, మండల పార్టీ ఉపాధ్యక్షులు ఆత్రం లక్ష్మణ్, చుంచు బాపురావు, ప్రధాన కార్యదర్శులు రాయిసిడం గొర్యకుమార్, దుర్గం పవన్ కుమార్, పార్టీ అధికార ప్రతినిధి కూన సురేష్, ఎస్టీ సెల్ మండల నాయకుడు జూగ్నక మారుతీ, ఎస్సీ సెల్ మండల నాయకుడు మల్యాల అశోక్, కిసాన్ సెల్ మండల నాయకుడు దూస మధుకర్, సేవాదళ్ మండల నాయకుడు బోరక్కడే శంకర్, తలండి సర్పంచ్ నైతం మంగు, మండల పార్టీ కార్యదర్శులు పూసం రాజు, కోవ శంకర్, బుద్దె బనయ్య, నాయకులు సిడం జలపతిరావు, మాడవి సాగర్, రొంపల్లి గ్రామపంచాయతీ కమిటీ ప్రధాన కార్యదర్శి పంద్రం యశ్వంత్ రావు, ఆత్రం దౌలత్ రావు తదితరులు పాల్గొన్నారు.