ఎంపీపీగా రాజన శ్రీవాణి ఏకగ్రీవంగా ఎన్నిక
రావికమతం నవంబర్ 19 మేజర్ న్యూస్ : మండల పరిషత్ అధ్యక్షురాలుగా టి అర్జాపురం 2 సెగ్మెంట్ నుంచి టిడిపి పార్టీ తరఫున ఇటీవల ఎన్నికైన ఎంపీటీసీ రాజాన శ్రీవాణి ఏకగ్రీవంగా ఎన్నికయింది. ఎంపీపీ పదవికి నామినేషన్ ఇవ్వాలని మండల రిటర్నింగ్ అధికారి కే మురళి కోరారు. టిడిపి పార్టీకి చెందిన గంపవాని పాలెం ఎంపీటీసీ ఆర్ రమణ శ్రీవాణి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా దొండపూడి ఎంపీటీసీ ఎం శంకర్రావు బలపరిచారు.. దీంతో శ్రీవాణి అభ్యర్థిత్వాన్ని బలపరిచే వారు చేతులు ఎత్తి ఎన్నుకోవాలని రిటర్నింగ్ అధికారి కోరారు. ఈ మేరకు టిడిపి, జనసేన వైఎస్ఆర్సిపి నుంచి గెలిచిన మండలంలో మిగిలిన 19 మంది ఎంపీటీసీలు చేతులెత్తారు. దీంతో శ్రీవాణి ఎంకగ్రవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి కూడా ప్రతిపాదనలు ఇవ్వాలని రిటర్నింగ్ అధికారి కోరారు. దీనికి ఎంపిటిసిలు ఎవరు ముందుకు రాకపోవడంతో శుక్రవారం 11 గంటలకు తిరిగి ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తామని రిటర్నింగ్ అధికారి మురళి ప్రకటించారు. అంతకుముందు ఎంపీటీసీగా గెలిచిన 20 మంది చే ఎంపీడీవో మహేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలన అధికారి సీతారామస్వామి. సీనియర్ అసిస్టెంట్ సుధాకర్ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణరావు పాల్గొన్నారు.