రాఘవేంద్ర స్వామి ఆలయంలో మేయర్ ప్రత్యేక పూజలు
అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : నగరంలోని ఒకటవ రోడ్డులో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆలయంలో గురువారం నగర మేయర్ సి.రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ రమేష్ గౌడ్, రఘునాథ్, లీగల్ సెల్ నాయకులు బాబ్జి, నాగన్న తదితరులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
ఆలయంలో పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి అనుగ్రహం పొందారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, నగరాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని ఆయన తెలియజేశారు. అనంతరం ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.