అనంతపురం రూరల్ మండల ఎంపీపీగా చల్లా జయకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక
అనంతపురం బ్యూరో, మేజర్న్యూస్ : అనంతపురం రూరల్ మండలంలో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి చెందిన చల్లా జయకృష్ణ ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా చల్లా జయకృష్ణ ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.
మండల అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని పార్టీ నాయకులు, శ్రేణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.