BREAKING
పలమనేరు దొర చెరువు వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు మూడు కార్లు ధ్వంసం.. రెండు కంటైనర్ లారీలు బోల్తా ప్రైవేట్ బస్సు ఢీకొని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు శింగనమల MPDO కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత MPTC స్థానాల సర్దుబాటుపై టీడీపీలో అసంతృప్తి.. పోలీసుల లాఠీఛార్జ్ ఐటిడిఏపిఓ, డిఈఓ లను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. తెలంగాణ నీటి వాటా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదుః టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలు మహాగాం పాఠశాలలో స్త్రీ శక్తి దివాస్ ఇందిరమ్మ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి •ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించడమే లక్ష్యం: డాక్టర్ నీలకంఠశ్వర్ రావు పలు గ్రామాల్లో పింఛను మంజూరు పత్రాల పంపిణీ స్థానిక సంస్థల విజయం కార్యకర్తల కే అంకితం. ఎమ్మెల్యే భూమాఅఖిలప్రియ తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. వెల్దుర్తి ఎంపీపీగా తోళ్ల మద్దిలేటి ప్రమాణం ఎంపీటీసీలతో ప్రమాణం చేయించిన ఆర్వో శ్రీదేవి ఘనంగా సన్మానించిన నేతలు.. అధికారుల అభినందనలు తిర్యాణిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఎంపీపీగా సబ్బవరపు సత్య వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన - ఎస్ఐ కొమురయ్య

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని

Select Suryaa Now
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం  టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేయడం ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చాలని భావిస్తున్నారని రాజగోపాల్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాపాలన ఏర్పాటు కోసం వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు జైళ్లకు వెళ్లి, అరెస్టులను ఎదుర్కొని, పదేళ్లపాటు నిరంతరం పోరాటం చేశారని దయాకర్ గుర్తుచేశారు. ప్రజాపాలన సాధనలో రాజగోపాల్ రెడ్డి పాత్ర, త్యాగం ఏమీలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి బీ-ఫారం తీసుకుని పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని ఆయన మర్చిపోకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా, ఎమ్మెల్సీగా అవకాశాలు కల్పించిన పార్టీపై విషపూరిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. బీజేపీ తరఫున గెలవలేక కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రజాపాలన కోసం ఎంతోమంది తెలంగాణ యువత తమ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి పోరాడారని, అలాంటి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి సమయంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దురుద్దేశంతో కూడిన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించే వారి పట్ల ఉదారంగా ఉండకుండా తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి చనగాని దయాకర్ విజ్ఞప్తి చేశారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.