telangana
ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
సూర్య దండేపల్లి : దండేపల్లి మండల కేంద్రంలోగురువారం కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్ర పటానికి నెల్కి వెంకటాపూర్ సహకార సంఘం చైర్మన్ ముత్యాల శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీర రాజేశ్వర్ నాయక్,వార్డు సభ్యుడు కట్కూరి రాజన్న, కాంగ్రెస్ నాయకులు అజీద్,బొలిశేట్టి సత్తయ్య, కొండు గోపాల్, పన్నాల భూపతి, టేకుమట్ల చంద్రయ్య,రవి,మహిళా నాయకురాలు తిరుపతమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు.